'కన్నప్ప'లో ప్రభాస్‌ సీన్స్‌ గురించి మంచు విష్ణు కామెంట్స్‌ | Vishnu Manchu Comments On Prabhas Role In Kannappa Movie | Sakshi
Sakshi News home page

'కన్నప్ప'లో ప్రభాస్‌ సీన్స్‌ గురించి మంచు విష్ణు కామెంట్స్‌

Published Sat, Jun 15 2024 11:20 AM | Last Updated on Sat, Jun 15 2024 11:35 AM

Vishnu Manchu Comments On Prabhas Role In Kannappa Movie

మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ కన్నప్ప టీజర్‌ తాజాగా విడుదలైంది. అద్భుతమైన విజువల్స్‌తో ప్రేక్షకులను ఫిదా చేస్తుంది. ఫాంటసీ డ్రామాగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇందులో మంచు విష్ణు కన్నప్పగా అలరించనున్నారు. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో సీనియర్‌ నటుడు మోహన్‌బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మోహన్‌లాల్‌, శివరాజ్‌కుమార్‌, ఆర్‌.శరత్‌కుమార్‌, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీలో ప్రభాస్‌-నయనతారలు శివపార్వతులుగా కనిపించనున్నారని టాక్‌ వినిపిస్తుండగా విష్ణు కీలక వ్యాఖ్యలు చేశారు.

అయితే, ప్రభాస్‌తో తనకు ఎలాంటి కాంబినేషన్ సీన్స్‌ లేవని మంచు విష్ణు పెద్ద బాంబ్ పేల్చారు. వీరిద్దరి మధ్య సీన్స్‌ ఉంటాయని ఇద్దరి ఫ్యాన్స్‌ భారీ అంచనాలు పెట్టుకున్నారు. తాజాగా ఈ సినిమాలో మంచు విష్ణు, ప్రభాస్ కాంబినేషన్ ఒక్కటంటే ఒక్క సీన్ కూడా లేదని ఇదే విషయాన్ని మంచు విష్ణు స్వయంగా బయటపెట్టారు. కానీ, మిగిలిన అందరి స్టార్స్‌ కాంబినేషన్‌లో ప్రభాస్‌ కనిపిస్తారని ఆయన తెలిపారు.   

పాన్‌ ఇండియా రేంజ్‌లో 'కన్నప్ప' చిత్రాన్ని ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌ తెరకెక్కిస్తున్నారు. టీజర్‌లోనే ఆయన ప్రతిభ కనిపిస్తుంది. తిన్నడు పాత్రలో విష్ణు పరిచయమైన తీరు ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తుంటే.. యుద్ధ సన్నివేశాల్లో ఆయన చేసిన సాహసాలు సినిమా అభిమానులను మెప్పిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement