చెబుతావా రత్నం | Vishal New Mocie Ratnam Song released | Sakshi
Sakshi News home page

చెబుతావా రత్నం

Published Thu, Apr 11 2024 1:11 AM | Last Updated on Thu, Apr 11 2024 1:11 AM

Vishal New Mocie Ratnam Song released - Sakshi

విశాల్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రత్నం’. హరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్‌ హీరోయిన్‌గా నటించారు. కార్తికేయన్‌ సంతానం నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న తెలుగు, తమిళ్‌లో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని శ్రీ సిరి సాయి సినిమాస్‌ బ్యానర్‌పై తెలుగులో సీహెచ్‌ సతీష్‌ కుమార్, కె. రాజ్‌కుమార్‌ విడుదల చేస్తున్నారు.

దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘చెబుతావా..’ అంటూ సాగే పాటని రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించగా, సింధూరి విశాల్‌ పాడారు. ‘‘యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం ‘రత్నం’.  ‘చెబుతావా..’ పాట మెలోడియస్‌గా, ఎమోషనల్‌గా సాగుతుంది’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement