Viral Video: Ranbir Kapoor Throws Away Fan Mobile - Sakshi
Sakshi News home page

Ranbir Kapoor: అభిమాని ఫోన్‌ లాక్కుని మరీ పారేసిన హీరో.. వీడియో వైరల్‌

Jan 28 2023 1:43 PM | Updated on Jan 28 2023 2:25 PM

Viral Video: Ranbir Kapoor Throws Away Fan Mobile - Sakshi

దీంతో చిరాకుపడ్డ హీరో అతడి ఫోన్‌ లాక్కుని విసిరేశాడు. ఊహించని పరిణామానికి అక్కడున్నవాళ్లు ఒక్కసారిగా షాకయ్యారు

ఆటోగ్రాఫ్‌ల కాలం పోయింది. ఇది సెల్ఫీల యుగం. ఫేవరెట్‌ హీరో కళ్లముందు కనిపిస్తే చాలు ఒక్క సెల్ఫీ తీసుకోకపోతే ప్రాణం పోయినట్లే ఫీలవుతున్నారు జనాలు. అదే సమయంలో సెల్ఫీల కోసం ఎగబడుతున్న అందరితోనూ ఫోటోలు దిగలేక అసహనంతో ఊగిపోతున్నారు సెలబ్రిటీలు. తాజాగా బాలీవుడ్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌తో ఓ ఫోటో దిగేందుకు ప్రయత్నించాడో అభిమాని. అందుకు హీరో కూడా అభ్యంతరం చెప్పలేదు. కానీ ఒక్కసారి క్లిక్‌మనిపించి ఊరుకోకుండా పర్‌ఫెక్ట్‌గా రావాలని అదేపనిగా ఫోటోలు తీసేందుకు ప్రయత్నించాడు.

దీంతో చిరాకుపడ్డ హీరో అతడి ఫోన్‌ లాక్కుని విసిరేశాడు. ఊహించని పరిణామానికి అక్కడున్నవాళ్లంతా ఒక్కసారిగా షాకయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అతడికెందుకంత పొగరని కొందరు, అచ్చం బాలయ్యలా ప్రవర్తిస్తున్నాడని మరికొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అతడి అభిమానులు మాత్రం ఇదేదో ప్రమోషన్‌ కోసమే అయ్యుంటుందని, ఏదైనా ఫోన్‌ను ప్రమోట్‌ చేయడానికి ఇలా చేసి ఉండొచ్చంటూ రణ్‌బీర్‌ను వెనకేసుకొస్తున్నారు.

చదవండి: నటుడితో డేటింగ్‌, ప్రియుడిని పెళ్లాడిన నటి

Advertisement
 
Advertisement
Advertisement