
చిన్నప్పుడు ఎవరైనా సరే ముద్దుగా ఉంటారు. ఈ బ్యూటీ కూడా సేమ్ అలానే. ఇప్పుడంటే హీరోయిన్‌గా వరస సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని ఫుల్ గా ఎంటర్‌టైన్ చేస్తోంది గానీ చిన్నప్పుడు మాత్రం చబ్బీగా ఉండేది. డ్యాన్సుల్లో ఈమె తర్వాత ఎవరైనా సరే అనేలా స్టెప్పులేస్తుంది. మరి ఇంతలా చెప్పాం కదా. ఈ వైరల్ బ్యూటీ ఎవరో కనిపెట్టారా? లేదా మమ్మల్నే చెప్పేయమంటారా?
పైన ఫొటోలో కనిపిస్తున్న పాప శ్రీలీల. రీసెంట్‌గా వైరల్ వయ్యారి అంటూ మరోసారి సోషల్ మీడియాని ఊపు ఊపేస్తోంది. ఈమె గురించి చెప్పుకోవాలంటే తెలుగు-కన్నడ మూలాలున్న ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. అమెరికాలో పుట్టింది గానీ పెరగడం అంతా బెంగళూరులోనే. తల్లిదండ్రులు విడిపోవడంతో తల్లితో కలిసి బెంగళూరు వచ్చేసింది. ప్రస్తుతం తల్లి, అమ్మమ్మతో కలిసి ఉంటోంది. మూడేళ్ల నుంచే క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంది.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ కొత్త సీజన్‍లో పహల్గామ్ బాధితురాలు?)
టీనేజీలో ఉండగానే కన్నడ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన శ్రీలీల.. 'పెళ్లి సందD' మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పటినుంచి ఇక్కడే వరస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. రీసెంట్‌గా గాలి జనార్ధన రెడ్డి కొడుకు కిరీటి హీరోగా పరిచయమైన 'జూనియర్' మూవీతో ప్రేక్షకుల్ని పలకరించింది. ఈ మూవీ యావరేజ్‌గా నిలిచింది. శ్రీలీల డ్యాన్స్‌కి మాత్రం మార్కులు పడ్డాయి.
ప్రస్తుతం తమిళంలో 'పరాశక్తి' అనే సినిమా చేస్తున్న శ్రీలీల.. తెలుగులో 'ఉస్తాద్ భగత్ సింగ్', హిందీలో కార్తిక్ ఆర్యన్‌తో ఓ సినిమా చేస్తోంది. పైన కనిపిస్తున్న తాజాగా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ బ్యూటీ మరోసారి వైరల్ అయింది. అప్పటికి ఇప్పటికీ ఎంత మారిపోయిందోనని మాట్లాడుకుంటున్నారు.
(ఇదీ చదవండి: 'అరుంధతి' చైల్డ్ ఆర్టిస్ట్‌కి పెళ్లి.. ఫ్రెండ్స్‌తో బ్యాచిలర్ పార్టీ)