లారెన్స్‌పై విజయ కాంత్‌ ఫ్యాన్స్‌ ఫైర్‌ | Vijayakanth Fans Fire On Raghava Lawrence | Sakshi
Sakshi News home page

లారెన్స్‌పై విజయ కాంత్‌ ఫ్యాన్స్‌ ఫైర్‌

Aug 16 2024 6:58 AM | Updated on Aug 16 2024 9:25 AM

Vijayakanth Fans Fire On Raghava Lawrence

దివంగత ప్రముఖ నటుడు విజయ కాంత్‌ వారసుడు షణ్ముఖ పాండియన్‌ తన తండ్రి బాటలోనే నటించడానికి సిద్ధమయ్యారు. అలా ఆయన సహాబ్దం చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం అయ్యారు. కాగా తాజాగా అన్బు దర్శకత్వంలో పడై తలైవన్‌ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. విజయకాంత్‌ మరణానంతరం షణ్ముఖ పాండియన్‌ హీరోగా నటిస్తున్న చిత్రంలో తాను కూడా   ఒక పాత్రలో నటిస్తానని రాఘవ లారెన్స్‌ మాట ఇచ్చారు. అయితే, కొన్ని కారణాల వల్ల ఇప్పుడు ఆయన ఈ చిత్రంలో నటించడం లేదు. దీంతో రాఘవ లారెన్స్‌ గురించి  సామాజిక మాధ్యమాల్లో పలు రకాలుగా రూమర్స్‌ వైరల్‌ అవుతున్నాయి. విజయ్‌ కాంత్‌ ఫ్యాన్స్‌ అయితే లారెన్స్‌ను ట్రోల్‌ చేయడం కూడా ప్రారంభించారు.

 

దీంతో చిత్ర దర్శకుడు అన్బు ఇలా క్లారిటీ ఇచ్చారు. విజయ కాంత్‌ కుమారుడు షణ్ముగ పాండియన్‌ హీరోగా నటిస్తున్న చిత్రంలో లారెన్స్‌ నటించడం లేదని తెలిపారు. తమ సినిమాలో ఒక పాత్రను పోషిస్తానని రాఘవ లారెన్స్‌ చెప్పిన విషయం తెలిసిందే..  దీంతో షణ్ముఖ పాండియన్‌తో పాటు తాను కూడా రాఘవ లారెన్స్‌ను వెళ్లి కలిశామని గుర్తుచేశారు. ఆ సమయంలో ఆయనకు ధన్యవాదాలు కూడా తెలిపామని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయనకు కథను చెప్పగా బాగుందని మెచ్చుకుంటూ తాను నటిస్తానని లారెన్స్‌ మాట కూడా ఇచ్చారు.  ఆ విధంగా చిత్ర షూటింగ్‌ ప్రారంభం అయిన తరుణంలో తనకు చిన్న సందేహం కలిగిందని డైరెక్టర్‌ చెప్పుకొచ్చాడు. 

ఈ చిత్రంలో నటుడు రాఘవ లారెన్స్‌ పాత్ర బలంగా ఉన్నట్లు గుర్తించామని ఆయన పేర్కొన్నారు. ఇదే విషయాన్ని లారెన్స్‌కు కూడా తెలిపినట్లు అన్బు అన్నారు. తన నిర్ణయాన్ని  రాఘవ లారెన్స్‌ కూడా స్వాగతించారని చెప్పారు. ఈ సనిమాలో లారెన్స్‌ నటించిక పోయిన విడుదల సమయంలో ప్రమోషన్‌ కార్య క్రమాలకు తన చేతనైన సహాయం చేస్తానని మాట ఇచ్చారన్నారు. కాగా రాఘవ లారెన్స్‌ నటించాల్సిన పాత్రలో దివంగత నటుడు విజయ్‌కాంత్‌ను ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతో నటింపజేస్తున్నట్లు సమాచారం.   

Advertisement
 
Advertisement
Advertisement