చిన్న కారులో వచ్చి నివాళులు.. విజయ్‌ సింప్లిసిటీకి ఫ్యాన్స్‌ ఫిదా! | Vijay Tribute Ambedkar On His Birth Anniversary, Video Goes Viral | Sakshi
Sakshi News home page

Vijay: అంబేద్కర్‌కు నివాళులర్పించిన విజయ్‌.. మరీ ఇంత సింపులేంటయ్యా!

Apr 14 2025 3:42 PM | Updated on Apr 14 2025 3:57 PM

Vijay Tribute Ambedkar On His Birth Anniversary, Video Goes Viral

తమిళ హీరో విజయ్‌ (Vijay) 'జననాయగన్‌' మూవీతో సినిమాలకు గుడ్‌బై చెప్పనున్నాడు. ఓ పక్క ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొంటూనే అటు రాజకీయ నాయకుడిగానూ ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటున్నాడు. నేడు (ఏప్రిల్‌ 14) డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ జయంతిని పురస్కరించుకుని చెన్నైలో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించాడు.

సింపుల్‌గా..
ఎటువంటి ఆడంబరం లేకుండా చిన్న కారులో నుంచి దిగి రోడ్డు పక్కన ఉన్న అంబేద్కర్‌ విగ్రహం దగ్గరకు చేరుకున్నాడు. కారు దగ్గరే చెప్పులు వదిలేసి చేతిలో పూలతో నడుచుకుంటూ వెళ్లి అంబేద్కర్‌ విగ్రహాన్ని పూలతో అలంకరించాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మందీమార్బలం లేకుండా, ఎటువంటి హడావుడి చేయకుండా తన పనేదో తను చేసుకుపోయిన విజయ్‌ వ్యవహార తీరుపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మా హీరో అంత సింపుల్‌గా ఎవరూ ఉండరని కామెంట్లు చేస్తున్నారు.

సినిమా
విజయ్‌ సినిమాల విషయానికి వస్తే.. ఈయన చివరగా ద గోట్‌ (The Greatest of All Time)సినిమాలో నటించాడు. ప్రస్తుతం జననాయగన్‌ మూవీ చేస్తున్నాడు. హెచ్‌ వినోద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. శృతి హాసన్‌ అతిథి పాత్రలో కనిపించనుంది. ఇది భగవంత్‌ కేసరి మూవీకి రీమేక్‌ అని తెలుస్తోంది. భగవంత్‌ కేసరిలో శ్రీలీల పోషించిన పాత్రను తమిళంలో మమిత బైజు చేయనున్నట్లు సమాచారం. ఈ మూవీని వచ్చే ఏడాది జనవరి 9న రిలీజ్‌ చేయనున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నారు.

 

 

చదవండి: ఆ హీరోకు నా సినిమాతో ఏం పని? నన్ను పక్కనపడేసి..: 'జాట్‌' విలన్‌

Advertisement
 
Advertisement
Advertisement