అప్పుడు భయం వేసింది: విజయ్‌ సేతుపతి | Vijay Sethupathi Interesting Comments About Maharaja Movie, Deets Inside | Sakshi
Sakshi News home page

అప్పుడు భయం వేసింది: విజయ్‌ సేతుపతి

Published Tue, Jun 18 2024 2:01 AM | Last Updated on Tue, Jun 18 2024 12:14 PM

Vijay Sethupathi about Maharaja movie

‘‘మహారాజ’ విడుదలకి ముందు హైదరాబాద్‌కి వచ్చాను. ఇక్కడ తెలుగు ప్రేక్షకులు నాపై చూపించిన ప్రేమాభిమానాలు చూసి కొంచెం భయం వేసింది. ఈ సినిమా తప్పకుండా విజయం సాధించాలని కోరుకున్నా. తెలుగు ప్రేక్షకులు అది నెరవేర్చడం ఆనందాన్నిచ్చింది. తెలుగు వారు నాపై చూపిన ప్రేమ చూస్తుంటే.. ఇది నా హోమ్‌టౌన్‌లానే అనిపిస్తోంది. నాకు ఈ అనుభూతిని ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అని హీరో విజయ్‌ సేతుపతి అన్నారు.

నితిలన్‌ సామినాథన్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘మహారాజ’. విజయ్‌ సేతుపతి హీరోగా నటించిన ఈ చిత్రంలో మమతా మోహన్‌దాస్, అనురాగ్‌ కశ్యప్‌ ఇతర లీడ్‌ రోల్స్‌ చేశారు. సుధన్‌ సుందరం, జగదీష్‌ పళనిసామి నిర్మించారు. ఈ మూవీని తెలుగులో ఎన్‌వీఆర్‌ సినిమా ఈ నెల 14న రిలీజ్‌ చేసింది. 

హైదరాబాద్‌లో నిర్వహించిన ‘మహారాజ’ మూవీ థ్యాంక్స్‌ మీట్‌లో నితిలన్‌ సామినాథన్‌ మాట్లాడుతూ– ‘‘తెలుగు ప్రేక్షకుల నుంచి మా ‘మహారాజ’కి లభిస్తున్న ఆదరణ చాలా ఆనందాన్నిచ్చింది’’ అన్నారు ‘‘మహారాజ’ని కుటుంబంతో కలసి చూడండి.. చాలా ఎంజాయ్‌ చేస్తారు’’ అన్నారు అతిథిగా పాల్గొన్న డైరెక్టర్‌ మారుతి. ‘‘ఈ మధ్య కాలంలో నేను చూసిన మంచి సినిమా ‘మహారాజ’’ అన్నారు మరో అతిథి గోపీచంద్‌ మలినేని. ‘‘ఈ సినిమా హిట్‌ ఏ రేంజ్‌కి వెళ్లి ఆగుతుందో చెప్పలేం’’ అన్నారు ఇంకో అతిథి బుచ్చిబాబు సాన. డైరెక్టర్‌ అనీల్‌ కన్నెగంటి, డిస్ట్రిబ్యూటర్‌ శశిధర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement