
విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కొత్త సినిమా రౌడీ జనార్దన్ (Rowdy Janardhan) ప్రారంభమైంది. ‘రాజా వారు రాణి గారు’ సినిమాతో మెప్పించిన క్లాసిక్ డైరెక్టర్ రవికిరణ్ ఇప్పుడు విజయ్‌తో భారీ యాక్షన్ మూవీ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా కీర్తి సురేష్ నటిస్తుంది. గతంలో వీరిద్దరు కలిసి మహానటి మూవీలో కలిసి పనిచేశారు. ఇప్పుడు విజయ్‌కు జోడీగా ఆమె నటిస్తున్నారు. గతేడాదిలో కీర్తి పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. వివాహం తర్వాత ఆమె చేస్తున్న భారీ చిత్రం ఇదే కావడం విశేషం.

ఫ్యామిలీస్టార్ మూవీ తర్వాత నిర్మాత దిల్ రాజు మరోసారి విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తున్నారు. తాజాగా జరిగిన పూజా కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్ కూడా పాల్గొన్నారు. SVC బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తున్నారు. 2026లో ఈ మూవీ విడుదల కానుంది. ఇందులో విలన్‌గా నటుడు రాజశేఖర్ నటించబోతున్నారని సమాచారం.