విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్.. క్రేజీ అప్‌డేట్‌ వచ్చేసింది! | Vijay Devarakonda's The Family Star Movie Lyrical Promo Released | Sakshi
Sakshi News home page

Family Star Movie: గీత గోవిందం కాంబో రిపీట్.. ఆ సాంగ్ ప్రోమో వచ్చేసింది!

Feb 6 2024 8:46 PM | Updated on Feb 7 2024 9:02 AM

Vijay Devarakonda Latest Movie Family star Song Promo Release - Sakshi

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తోన్న చిత్రం ఫ్యామిలీ స్టార్. గీత గోవిందంతో సూపర్ హిట్ కొట్టిన పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ ‍అప్‌డేట్ వచ్చేసింది. ఈ నెల 7వ తేదీన ఫస్ట్ సింగిల్ 'నందనందనా..' రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. 

ఈ చిత్రాన్ని ఫుల్ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. తాజాగా రిలీజైన ప్రోమో అభిమానులను ఆకట్టుకుంటోంది. గీత గోవిందంలోని 'ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే' పాటకు పనిచేసిన లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్, సింగర్ సిధ్ శ్రీరామ్, మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ కాంబోలో ఈ సాంగ్ వస్తోంది. కాగా..ఈ చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Advertisement
 
Advertisement
Advertisement