విజయ్- రష్మిక ఎంగేజ్‌మెంట్‌.. తేదీ ఫిక్స్? | Vijay Devarakonda-Rashmika Mandanna Ready To Tie Knot This Year Goes Viral | Sakshi
Sakshi News home page

Vijay Devarakonda and Rashmika: విజయ్- రష్మిక ఎంగేజ్‌మెంట్‌.. అప్పుడేనా?

Jan 8 2024 12:58 PM | Updated on Jan 8 2024 1:23 PM

Vijay Devarakonda-Rashmika Mandanna Ready To Tie Knot This Year Goes Viral - Sakshi

గతేడాది టాలీవుడ్‌లో ప్రముఖ తారలు పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. వరుణ్ తేజ్- లావణ్య, మంచు మనోజ్- మౌనిక, శర్వానంద్-రక్షితా రెడ్డి వివాహాం చేసుకున్నారు. అయితే టాలీవుడ్‌లో మరో క్రేజీ జంట పెళ్లికి సిద్ధమవుతున్నట్లు లేటెస్ట్ టాక్. ఇప్పటికే వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నట్లు చాలాసార్లు వార్తలు కూడా వచ్చాయి. అంతే కాదు కొన్నిసార్లు అనుకోకుండా సోషల్ మీడియా పోస్టులతో అభిమానులకు దొరికిపోయారు. ఆ జంట ఎవరో ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది. ఇంకెవరో కాదు.. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో కలిసి నటించిన విజయ్ దేవరకొండ, రష్మిక జోడీనే.

అయితే కొత్త ఏడాదిలో ఈ ప్రేమజంట పెళ్లి చేసుకోబోతున్నారని నెట్టింట టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఎంగేజ్‌మెంట్‌ కూడా జరగనున్నట్లు సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలవుతోంది. ఈ విషయంపై ఇప్పటికే వారి కుటుంబ సభ్యులు ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అన్ని ‍అనుకున్నట్లు జరిగితే వచ్చేనెల రెండోవారంలోనే నిశ్చితార్థం తేదీని ప్రకటించనున్నారని తెలుస్తోంది. అయితే ఇందులో నిజమెంతో తెలియరావడం లేదు. అయితే ఈ విషయం కేవలం సోషల్ మీడియాలో వైరలవుతోందా? లేదా నిజంగానే ఫిబ్రవరిలో ఎంగేజ్‌మెంట్‌ తేదీని ప్రకటిస్తారా? అనేది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు విజయ్, రష్మిక ఎక్కడా కూడా స్పందించలేదు. 

కాగా.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా ఫ్యామిలీ స్టార్ చిత్రంలో నటిస్తున్నారు. మరోవైపు రష్మిక ఇటీవలే యానిమల్‌ సినిమాతో సూపర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. రష్మిక ప్రస్తుతం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న పుష్ప-2 చిత్రంలో నటిస్తోంది. కాగా.. గతేడాది దీపావళి సందర్భంగా రష్మిక మందన్నా.. విజయ్‌ ఇంట్లో సెలబ్రేట్‌ చేసుకుంటూ దొరికిపోయిన సంగతి తెలిసిందే. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement