సైలెంట్‌గా కొత్త సినిమా పూర్తి చేసిన విజయ్‌ ఆంటోని | Vijay Antony New Movie Launched | Sakshi
Sakshi News home page

సైలెంట్‌గా కొత్త సినిమా పూర్తి చేసిన విజయ్‌ ఆంటోని

Oct 12 2024 7:03 AM | Updated on Oct 12 2024 8:49 AM

Vijay Antony New Movie Launched

కథానాయకుడిగా సక్సెస్‌ అయిన సంగీత దర్శకుడు విజయ్‌ ఆంటోని. బిచ్చగాడు సినిమాతో తెలుగు వారికి బాగా కనెక్ట్‌ అయిన విజయ్‌  నుంచి జయాపజయాలకు అతీతంగా పలు చిత్రాల్లో నటిస్తూనే ఉన్నారు. దర్శకుడిగా కూడా ఆయన ప్రతిభను ప్రేక్షకులకు చూపించారు. మల్టీ టాలెంటెడ్‌గా రాణిస్తున్నున్న విజయ్‌ నిర్మాతగానూ విజయాలు అందుకున్నారు. విజయ్‌ఆంటోని తాజాగా నటించిన హిట్లర్‌ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. 

ఈ విషయాన్ని అటుంచితే ఈయన తాజాగా మరో చిత్రంలో నటిస్తున్నారు. అంతేకాదు ఈ చిత్రాన్ని తన విజయ్‌ ఆంటోని ఫిలిం కార్పొరేషన్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. ఎలాంటి హంగామా లేకుండా, అసలు ప్రారంభం అయిన విషయాన్నే తెలపకుండా చిత్ర షూటింగ్‌ను పూర్తి చేశారు. ఈ చిత్రం ద్వారా లియో జాన్‌పాల్‌ అనే ఎడిటర్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. 

ఈయన  పిజ్జా, సూదుకవ్వుమ్‌  (గడ్డం గ్యాంగ్ పేరుతో తెలుగులో రీమేక్‌ అయింది)  తదితర చిత్రాలకు ఎడిటర్‌గా పని చేశారు. మహానది శంకర్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి  విజయ్‌ఆంటోనినే సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement