Vijay Antony Speech In Bichagadu 2 Success Meet At Vizag RK Beach - Sakshi
Sakshi News home page

తెలుగు రాష్ట్రాల్లో ఇల్లు కట్టుకుంటా: 'బిచ్చగాడు' హీరో విజయ్‌ ఆంటోని

May 28 2023 11:52 AM | Updated on May 28 2023 12:06 PM

Vijay Antony Bichagadu 2 Sucess Meet At Vizag Rk Beach - Sakshi

బీచ్‌రోడ్డు: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇళ్లు కట్టుకుంటా.. తెలుగు భాష నేర్చుకుంటానని హీరో విజయ్‌ ఆంటోనీ అన్నారు. బిచ్చగాడు–2 సినిమా సక్సెస్‌ మీట్‌ను శనివారం బీచ్‌రోడ్డులో నిర్వహించారు. బిచ్చగాడు, బిచ్చగాడు–2 సినిమాలను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. భవిష్యత్తులో తన చిత్రాల షూటింగ్‌ తెలుగు రాష్ట్రాల్లో జరుపుతామన్నారు. త్వరలోనే బిచ్చగాడు–3 కూడా తెరకెక్కించనున్నట్టు చెప్పారు.

ఈ చిత్రం 2026లో విడుదలవుతుందన్నారు. ఈ సందర్భంగా బిచ్చగాడు 2లోని చెల్లి చెల్లి పాట పాడి ప్రేక్షకులను అలరించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్‌ పాల్గొని చిత్ర యూనిట్‌ను అభినందించారు. ఈ సందర్భంగా విజయ్‌ ఆంటోనీ మాట్లాడుతూ బిచ్చగాడుని మించి బిచ్చగాడు–2 విజయవంతం అవ్వడం సంతోషంగా ఉందన్నారు.

ఈ రెండు సినిమాలు తెలుగులో సూపర్‌ హిట్లు కావడం ఆనందంగా ఉందన్నారు. డిస్ట్రిబ్యూటర్‌ సురేష్‌ మాట్లాడుతూ బిచ్చగాడు–2 సినిమా తమిళంలో కన్నా తెలుగులోనే బాగా విజయవంతం అయ్యిందన్నారు. ఆంధ్రాలోనే అతి పెద్ద థియేటర్‌ అయిన జగదాంబలో బిచ్చగాడు–2 సినిమా హౌస్‌ఫుల్‌గా నడుస్తోందన్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లోను పూర్వీ పిక్చర్స్‌ ద్వారా విడుదలైందని తెలిపారు. కథ బాగుంటే హీరో ఎవరైనా సరే సినిమా హిట్‌ అవుతుందనడానికి ఈ సినిమానే ఉదాహరణ అని అన్నారు. ఈ కార్యక్రమంలో థియేటర్‌ అధినేత వి.జగదీష్‌, మేనేజర్‌ రాజు, పూర్వీ పిక్చర్స్‌ అధినేత నాయుడు తదితరులు పాల్గొన్నారు. 2026లో బిచ్చగాడు 3

Advertisement
 
Advertisement
Advertisement