Vignesh Shivan Reveals His Love Story With Nayanthara, Know How It Starts - Sakshi
Sakshi News home page

Vignesh Shivan Nayanthara Love Story: 'డేటింగ్‌లో ఉన్నా ఆమె క్యారవాన్‌కు కూడా వెళ్లలేదు.. ధనుష్‌ వల్లే ఇదంతా'!

Apr 15 2023 12:37 PM | Updated on Apr 15 2023 1:35 PM

Vignesh Shivan Reveals His Love Story With Nayanthara How It Starts - Sakshi

సౌత్‌ లేడీ సూపర్‌స్టార్‌ నయనతార కోలీవుడ్‌ రెక్టర్ విఘ్నేష్ శివన్ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరు ఇటీవల ఇరువురి కుటుంబసభ్యుల సమక్షంలో మూడుమూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. సరోగసి ద్వారా కవల పిల్లలకు తల్లిదండ్రులుగా మారిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా విఘ్నేశ్‌ శివన్‌ నయనతారతో తన ప్రేమ కహానీని వెల్లడించారు.

పోడాపోడి సినిమాతో డైరెక్టర్‌గా మారిన నేను తొలి సినిమాతోనే భారీ పరాజయాన్ని చూశాను. కెరీర్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ‘నేనూ రౌడీనే’ అనే కథ రాశాను. హీరో ధనుష్‌ కథ నచ్చడంతో దాన్ని ప్రొడ్యూస్‌ చేయడానికి ముందుకు వచ్చాడు. నయనతారను కలిసి కథ చెప్పమన్నాడు. నయన్‌ అంగీకరించదేమో అని అనుకొని నజ్రియాతో మాట్లాడదామనుకున్నా. కానీ ధనుష్‌ చెప్పడంతో నయన్‌ దగ్గరికి వెళ్లా. ఆమె నన్ను ఎంతో గౌరవించింది. ఆ క్షణమే నయన్‌తో ప్రేమలో పడిపోయా.

ఆ సినిమా సెకండ్‌ షెడ్యూల్‌ నుంచే మేం ఇద్దరం డేటింగ్‌లో ఉన్నాం. కానీ సెట్స్‌లో అస్సలు బయటపడలేదు. నయన్‌ను మేడమ్‌ అనే పిలిచేవాడ్ని. ఆమె క్యారవాన్‌కు కూడా వెళ్లేవాడిని కాదు. ఇద్దరం వృత్తిపరంగా ప్రొఫెషనల్‌గా ఉండేవాళ్లం. మేం ప్రేమలో ఉన్నామని చెప్పేవరకు ఈ విషయం ఎవరికి తెలియదు అంటూ విఘ్నేశ్‌ తన లవ్‌స్టోరీని రివీల్‌ చేశాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement