విదార్థ్‌ హీరోగా సైకో థ్రిల్లర్‌ మూవీ ప్రారంభం! | Vidharth New Movie Launched | Sakshi
Sakshi News home page

Vidharth: విదార్థ్‌ హీరోగా సైకో థ్రిల్లర్‌ మూవీ ప్రారంభం!

Jul 2 2022 4:17 PM | Updated on Jul 2 2022 4:38 PM

Vidharth New Movie Launched - Sakshi

ఇందులో నటించే హీరోయిన్‌, విలన్‌ పాత్రదారుల ఎంపిక జరుగుతోందని దర్శకుడు తెలిపారు. ఇది పోలీస్‌ అధికారి ఇన్‌వెస్టిగేషన్‌ ఇతివృత్తంతో సాగే సైకో థ్రిల్లర్‌ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు.

నటుడు విదార్థ్‌ నూతన చిత్రం శుక్రవారం ఉదయం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. గ్రీనేటివ్‌ ఫిలింస్‌ పతాకంపై ఆర్‌.మోహన్‌ రాజేశ్‌ బాబు నిర్మిస్తున్న మొదటి చిత్రమిది. రచయిత శ్రీనివాసన్‌ సుందర్‌, కథ, కథనం, మాటలు అందిస్తున్న ఈ చిత్రం ద్వారా మణిమారన్‌ నటరాజ్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. చిత్ర పూజా కార్యక్రమాల్లో ఐఏఎస్‌ అధికారి నందకుమార్‌, దర్శకుడు కార్తీక్‌ సుందర్‌, సద్గుణాలు, రామనాథ్‌ పళణి కుమార్‌, డోరా దాస్‌ రామస్వామి తదితర సినీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా పాల్గొని చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

కాగా ఇందులో నటించే హీరోయిన్‌, విలన్‌ పాత్రదారుల ఎంపిక జరుగుతోందని దర్శకుడు తెలిపారు. ఇది పోలీస్‌ అధికారి ఇన్‌వెస్టిగేషన్‌ ఇతివృత్తంతో సాగే సైకో థ్రిల్లర్‌ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. దీనికి జీబ్రాన్‌ సంగీతాన్ని ఎస్‌ఆర్‌ సతీష్‌కుమార్‌ చాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్రనిర్మాణ సంస్థ గ్రీనేటివ్‌ డాట్‌ కామ్‌ పేరుతో వెబ్‌సైట్‌ను ప్రారంభించింది.

చదవండి: ‘పక్కా కమర్షియల్‌’ ఫస్ట్‌డే కలెక్షన్స్‌ ఎంతంటే..
ఫ్రెండ్‌తో వన్‌ నైట్‌ స్టాండ్‌.. తల్లిని కావాలని లేదు: నటి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement