చాలా సింపుల్‌గా హీరో వెంకటేశ్‌ రెండో కూతురి పెళ్లి! | Venkatesh Second Daughter Hayavahini Weds Nishanth, Marriage Photos Goes Viral - Sakshi
Sakshi News home page

Venkatesh Daughter Marriage Photos: చాలా సింపుల్‌గా స్టూడియోలో కూతురి పెళ్లి చేసిన వెంకటేశ్‌.. ఫోటోలు వైరల్‌

Mar 16 2024 6:44 AM | Updated on Mar 16 2024 11:16 AM

venkatesh second daughter hayavahini Weds Nishanth - Sakshi

విక్టరీ వెంకటేశ్‌ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ఆయన రెండో కూతురు హయవాహిని వివాహం బంధంలోకి అడుగు పెట్టారు. విజయవాడకు చెందిన  ఓ డాక్టర్‌ కుమారుడు నిషాంత్‌తో కలిసి ఏడడుగులు వేశారు. గతేడాద అక్టోబర్‌లో ఎంతో సింపుల్‌గా వీరి నిశ్చితార్థం జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకకు మహేశ్‌ బాబు, రానా, నాగచైతన్య తదితర హీరోలు హాజరై కాబోయే వధూవరులను ఆశ్వీర్వదించారు.

ఇక శుక్రవారం(మార్చి 15) జరిగిన పెళ్లి వేడుకకి బయటి వారెవరెవరిని ఆహ్వానించలేదు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో రామా నాయుడు స్టూడియోలో చాలా సింపుల్‌గా పెళ్లి జరిపించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. కాగా, వెంకీ, నీరజ దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఓ కొడుకు ఉన్నాడు. పెద్దమ్మాయి ఆశ్రితకు 2019లో పెళ్లి జరిగింది. 

Advertisement
 
Advertisement
Advertisement