వెంకటేశ్‌- అనిల్‌ రావిపూడి హ్యాట్రిక్‌ సినిమా | Venkatesh And Anil Ravipudi Movie Plan Confirmed, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

వెంకటేశ్‌- అనిల్‌ రావిపూడి హ్యాట్రిక్‌ సినిమా

Jul 2 2024 9:06 AM | Updated on Jul 2 2024 10:35 AM

Venkatesh And Anil Ravipudi Movie Plan Confirmation

‘ఎఫ్‌ 2, ఎఫ్‌ 3’ చిత్రాల తర్వాత హీరో వెంకటేశ్, దర్శకుడు అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో మరో సినిమా ప్రకటన వచ్చేసింది. అందుకు సంబంధించిన పోస్టర్‌ను కూడా మేకర్స్‌ విడుదల చేశారు. ‘దిల్‌’ రాజు, శిరీష్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇందులో  మీనాక్షి చౌదరిని హీరోయిన్‌గా ఇప్పటికే ఎంపిక చేశారు. తాజాగా మరో  పాత్ర కోసం ఐశ్వర్య రాజేశ్‌ని తీసుకున్నట్లు  దర్శకుడు అనిల్‌రావిపూడి ప్రకటించారు.

అయితే, తాజాగా ఈ సినిమా స్క్రిప్ట్, ప్రీ ప్రోడక్షన్‌ వర్క్స్‌ను పూర్తి చేశారు దర్శకుడు అనిల్‌ రావిపూడి. బాపట్ల జిల్లా శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన స్క్రిప్టును స్వామి వారి పాదాల వద్ద ఉంచి ఆయన పూజలు చేశారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన రెండు సినిమాలు హిట్‌ కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై ఫ్యాన్స్‌లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. యాక్షన్‌ నేపథ్యంలో సాగే చిత్రమని దర్శకుడు అన్నారు. 

ఇందులో వెంకటేశ్‌ భార్యగా ఐశ్వర్య, ఆయన ప్రియురాలి పాత్రలో మీనాక్షి చౌదరి కనిపించనున్నారని ముందే అనిల్‌ రివీల్‌ చేశాడు. మాజీ పోలీసాఫీసర్, అతని భార్య, ఆ పోలీసాఫీసర్‌ మాజీ ప్రేయసి... ఈ మూడు ప్రధాన పాత్రల నేపథ్యంలో సాగే క్రైమ్‌ ఎంటర్‌టైనర్‌ మూవీ అని ఆయన అన్నాడు. ఈ నెల 3 నుంచి ఈ ప్రాజెక్ట్‌ చిత్రీకరణ ప్రారంభించి వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నట్లు అనిల్‌ రావిపూడి తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement