అనంత్‌ అంబానీ పెళ్లి వేడుకలో వీణ శ్రీవాణి సందడి | Veena Srivani Performance In Anant Ambani Marriage | Sakshi
Sakshi News home page

అనంత్‌ అంబానీ పెళ్లి వేడుకలో వీణ శ్రీవాణి సందడి

Jul 13 2024 9:28 AM | Updated on Jul 13 2024 10:18 AM

Veena Srivani Performance In Anant Ambani Marriage

వీణ శ్రీవాణి.. ఈ పేరు సోషల్‌ మీడియాలో సెన్సేషన్‌.. వీణపై స్వరాలు పలికిస్తూ ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ఆమె టాలెంట్‌కు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ వరకు సినిమా పాటలతో పాటు భక్తి గీతాలను తన వీణతో వాయించటం శ్రీవాణి ప్రత్యేకత. తాజాగా  ఆమె రిలయన్స్‌ గ్రూపు అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ ఇంట పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. అక్కడ తన వీణ ద్వారా పెళ్లికి వచ్చిన అతిథిలను మెప్పించారు.

అనంత్‌  అంబానీ- రాధికా మర్చంట్‌ పెళ్లి వేడుకలో దేశవిదేశాలకు చెందిన వ్యాపార, రాజకీయ, సినీ, క్రీడారంగాల ప్రముఖులు పాల్గొన్నారు. ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్సు (బీకేసీ)లో ఉన్న జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ వారి కల్యాణానికి వేదికగా నిలిచింది. అందులో వీణ శ్రీవాణి తన వీణా నైపుణ్యంతో అద్భుతంగా వాయించి మెప్పించారు.

ఈ క్రమంలో అంబానీ పెళ్లి వేడుక గురించి వీణ శ్రీవాణి ఇలా చెప్పారు. 'ప్రపంచవ్యాప్తంగా ఎందరో ప్రముఖులు హాజరుకానున్న ఈ వేడుకులో నాకు వీణ వాయించే అవకాశం దక్కడం ఆనందంగా ఉంది. తెలుగు వారి తరుపన వెళ్లడం మరింత సంతోషాన్ని ఇచ్చింది. వారు మా కోసం ప్రేత్యేకంగా ఏర్పాటు చేసిన స్టేజీ చాలా అద్భుతంగా ఉంది. మన తెలుగు వారి సంప్రదాయాన్ని రిప్రెజెంట్‌ చేయాలని నేను ఎలా అయితే అనుకున్నానో అలాగే నీతా అంబానీ గారు కూడా నా డ్రస్‌ను సెలక్ట్‌ చేశారు. అంబానీ కుటుంబం చాలా గౌరవంగా పలకరించారు. ఎక్కడే కానీ చిన్న ఇబ్బంది కలగకుండా నన్ను చూసుకున్నారు.' అని ఆమె తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement