సెట్‌లో స్టార్ట్‌  | Sakshi
Sakshi News home page

సెట్‌లో స్టార్ట్‌ 

Published Fri, Dec 15 2023 3:56 AM

Varun Tej Matka Shoot Begins - Sakshi

వరుణ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్న పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా ఫిల్మ్‌ ‘మట్కా’. ఈ చిత్రంలో నోరా ఫతేహి, మీనాక్షీ చౌదరి హీరోయిన్లు. కరుణ కుమార్‌ దర్శకత్వంలో ఈ పాన్‌ ఇండియన్‌ చిత్రాన్ని విజయేందర్‌ రెడ్డి తీగల, మోహన్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. వైజాగ్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ గురువారం హైదరాబాద్‌లో మొదలైంది.

‘‘యావత్‌ దేశాన్ని కదిలించిన ఓ వాస్తవ ఘటన ఆధారంగా ‘మట్కా’ను తెరకెక్కిస్తున్నాం. ఇందులో వరుణ్‌ తేజ్‌ నాలుగు విభిన్నమైన గెటప్స్‌లో కనిపిస్తారు. ఈ సినిమా కథాంశం ప్రధానంగా 1958–1982ల మధ్య జరుగుతుంది. అందుకుని 1950, 1980 నాటి పరిస్థితులను రీ క్రియేట్‌ చేస్తున్నాం. అలా రీ క్రియేట్‌ చేసిన ఓ భారీ సెట్‌లోనే ‘మట్కా’ షూటింగ్‌ జరుగుతోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్‌ కానుంది’’ అని యూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్‌.

Advertisement
 
Advertisement
 
Advertisement