సెలవులు కలిసొచ్చేలా... | Varun Tej Matka to release on 14 November | Sakshi
Sakshi News home page

సెలవులు కలిసొచ్చేలా...

Oct 2 2024 12:12 AM | Updated on Oct 2 2024 1:21 AM

Varun Tej Matka to release on 14 November

వరుణ్‌ తేజ్‌ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘మట్కా’. కరుణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నోరా ఫతేహి, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. వైర ఎంటర్‌టైన్మెంట్స్, ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్మెంట్స్‌పై డా. విజయేందర్‌ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ పాన్‌ ఇండియా మూవీని నవంబరు 14న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్‌ ప్రకటించి, వరుణ్‌ తేజ్‌ కొత్త పోస్టర్‌ని రిలీజ్‌ చేశారు. ‘‘మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ‘మట్కా’ రూపొందుతోంది.

కరుణ కుమార్‌ పవర్‌ఫుల్‌ స్క్రిప్ట్‌ను తయారు చేశారు. 1958 నుంచి 1982 వరకు 24 ఏళ్ల బ్యాక్‌డ్రాప్‌ని ఎంచుకున్నారాయన. వరుణ్‌ తేజ్‌ని నాలుగు డిఫరెంట్‌ లుక్స్‌లో అద్భుతంగా చూపిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ చివరి దశలో ఉంది. వరుణ్‌ తేజ్, ఫైటర్స్‌పై సినిమాకి కీలకమైన, ఇంటెన్స్‌ యాక్షన్‌ ఎపిసోడ్‌ను చిత్రీకరిస్తున్నాం.

మరోవైపు నిర్మాణానంతర పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. కార్తీక ΄ûర్ణమికి ముందుగా నవంబర్‌ 14న విడుదల కానున్న మా సినిమాకి లాంగ్‌ వీకెండ్‌ కలిసొస్తుంది’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. నవీన్‌ చంద్ర, సలోని, అజయ్‌ ఘోష్, పి. రవిశంకర్‌ నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్, కెమెరా: ఎ. కిశోర్‌ కుమార్‌.

Advertisement
 
Advertisement
Advertisement