మెగా హీరో సడన్ సర్‌ప్రైజ్.. ఆశలన్నీ దీనిపైనే | Varun Tej Matka Movie Release Date Confirmed | Sakshi
Sakshi News home page

Matka Movie: వింటేజ్ లుక్‌.. రిలీజ్ డేట్ ప్రకటన

Oct 1 2024 2:10 PM | Updated on Oct 1 2024 4:28 PM

Varun Tej Matka Movie Release Date Confirmed

మెగా హీరో వరుణ్ తేజ్ మంచి నటుడే. వైవిధ్యమైన సినిమాలు చేస్తుంటాడు. ఇక్కడివరకు బాగానే ఉంది. అదృష్టమే కలిసి రావడం లేదు. ఎందుకంటే గత మూడు నాలుగు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఘోరమైన డిజాస్టర్స్‌గా నిలిచాయి. దీంతో మార్కెట్ పూర్తిగా పడిపోయింది. ఇలాంటి టైంలో 'మాట్కా' అనే మూవీ చేస్తున్నాడు. ఇప్పుడు దీని రిలీజ్ డేట్ ఖరారు చేశారు.

(ఇదీ చదవండి: పెళ్లికి ముందే పిల్లల గురించి శోభిత కామెంట్స్)

'పలాస' మూవీ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న 'మాట్కా' చిత్రాన్ని.. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీస్తున్నారు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. జీవీ ప్రకాశ్ సంగీత దర్శకుడు. నవంబరు 14న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.

కొన్నాళ్ల క్రితం బడ్జెట్ సమస్యల వల్ల ఈ సినిమా ఆగిపోయిందనే రూమర్స్ వచ్చాయి. కానీ శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఇంతలోనే సర్‌ప్రైజ్ అన్నట్లు రిలీజ్ డేట్‌తో వచ్చేశారు. దీనితో పాటే సూర్య 'కంగువ' రిలీజ్ కానుంది. మరి వరుణ్ తేజ్ హిట్ కొట్టి కమ్ బ్యాక్ ఇస్తాడా లేదా అనేది చూడాలి?

(ఇదీ చదవండి: నాలుగో పెళ్లికి సిద్ధమైన ప్రముఖ నటి.. డేట్ ఫిక్స్)

Advertisement
 
Advertisement
Advertisement