Ghani: హాలీవుడ్‌ స్టైల్‌ యాక్షన్‌ షురూ | Varun Tej Ghani gears up for the next schedule | Sakshi
Sakshi News home page

వరుణ్‌ తేజ్‌ కోసం హాలీవుడ్‌ స్టంట్‌ మాస్టర్స్‌

May 27 2021 3:49 AM | Updated on May 27 2021 7:32 AM

Varun Tej Ghani gears up for the next schedule - Sakshi

వరుణ్‌ తేజ్‌ బాక్సర్‌గా నటిస్తున్న చిత్రం ‘గని’. బాలీవుడ్‌ బ్యూటీ సయీ మంజ్రేకర్‌ కథానాయికగా నటిస్తున్నారు. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో అల్లు అరవింద్‌ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ నిర్మిస్తున్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ పరిస్థితులు చక్కబడగానే తిరిగి చిత్రీకరణ మొదలు పెట్టనున్నారు. సిద్ధు ముద్ద మాట్లాడుతూ – ‘‘మా సినిమా ఇప్పటికే 70 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. బాక్సింగ్‌ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది.

ఈ లాక్‌డౌన్‌లోనూ బాక్సింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నారు వరుణ్‌. లాక్‌డౌన్‌ తర్వాత మొదలయ్యే షెడ్యూల్‌లో వరుణ్, ఇతర ప్రధాన తారాగణంపై యాక్షన్, కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తాం. ఇందుకోసం భారీ స్టేడియమ్‌ సెట్‌ వేయించాం. హాలీవుడ్‌లో ‘టైటాన్స్‌’, బాలీవుడ్‌లో ‘సుల్తాన్‌’ వంటి చిత్రాలకు యాక్షన్‌ సన్నివేశాలను డిజైన్‌ చేసిన హాలీవుడ్‌ స్టంట్‌ మాస్టర్స్‌ లార్నెల్‌ స్టోవల్, వ్లాడ్‌ రింబర్గ్‌ ఆధ్వర్యంలో యాక్షన్‌ పార్ట్‌ చిత్రీకరిస్తాం’’ అన్నారు. సో...యాక్షన్‌ హాలీవుడ్‌ స్టైల్‌లో ఉంటుందని ఊహించవచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement