యాక్షన్‌ రెడీ | Varalaxmi Sarathkumar Police Complaint set to release on June 12 | Sakshi
Sakshi News home page

యాక్షన్‌ రెడీ

Jun 8 2026 4:03 AM | Updated on Jun 8 2026 4:03 AM

Varalaxmi Sarathkumar Police Complaint set to release on June 12

నవీన్‌ చంద్ర, వరలక్ష్మి శరత్‌కుమార్, కృష్ణ సాయి, రాగిణి ద్వివేది ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం పోలీస్‌ కంప్లైంట్‌’. సంజీవ్‌ మేగోటి దర్శకత్వంలో బాలకృష్ణ మహారాణా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. ఈ చిత్రంలో సూపర్‌స్టార్‌ కృష్ణకు నివాళిగా రూపొందించిన ప్రత్యేక గీతాన్ని ఆయన సోదరుడు, ప్రముఖ నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరి రావు వీక్షించారు. ‘‘ఈ పాట బాగుంది. సినిమా మంచి విజయాన్ని అందుకోవాలి’’ అని యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు.

‘‘కృష్ణసాయి, కృతి వర్మలపై చిత్రీకరించిన ఈ ప్రత్యేక గీతాన్ని ఇటీవల విడుదల చేయగా, కృష్ణగారి అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. హారర్, యాక్షన్, థ్రిల్లర్‌ అంశాలతో మంచి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది’’ అని సంజీవ్‌ మేగోటి తెలిపారు. ‘‘మా సినిమాని థియేటర్లలో చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు కృష్ణసాయి. 

Advertisement
 
Advertisement
Advertisement