ఆసక్తి రేకెత్తిస్తున్న ‘ది వ్యాక్సిన్‌ వార్‌’ ట్రైలర్‌ | 'The Vaccine War' Official Trailer Out | Sakshi
Sakshi News home page

The Vaccine War: ఆసక్తి రేకెత్తిస్తున్న ‘ది వ్యాక్సిన్‌ వార్‌’ ట్రైలర్‌

Sep 13 2023 9:13 AM | Updated on Sep 13 2023 9:39 AM

The Vaccine War Hindi Trailer Out - Sakshi

‘ది కశ్మీరీ ఫైల్స్‌’ వంటి హిట్‌ మూవీ తర్వాత దర్శకుడు వివేక్‌ రంజన్‌ అగ్నిహోత్రి తెరకెక్కించిన తాజా చిత్రం ‘ది వ్యాక్సిన్‌ వార్‌’. నానా పటేకర్, అనుపమ్‌ ఖేర్, పల్లవి జోషి, సప్తమి గౌడ, పరితోష్‌ సాండ్, స్నేహ మిలాండ్, దివ్య సేథ్‌ నటించారు. పల్లవి జోషి నిర్మించారు. అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ అభిషేక్‌ అగర్వాల్‌ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. ఈ నెల 28న ఈ చిత్రం విడుదల కానుంది.

మంగళవారం హిందీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘‘భారతదేశపు మొట్టమొదటి బయో–సైన్స్‌ చిత్రమిది. కోవిడ్‌ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి శాస్త్రవేత్తలు ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? అన్నదే ఈ చిత్ర కథ’’ అని యూనిట్‌ పేర్కొంది. కాగా ‘వ్యాక్సిన్‌ వార్‌’ చిత్రం తెలుగు, హిందీ, ఇంగ్లిష్, గుజరాతీ, పంజాబీ, భోజ్‌పురి, బెంగాలీ, మరాఠీ, తమిళ, కన్నడ, ఉర్దూ, అస్సామీ భాషల్లో విడుదల కానుంది.  

Advertisement
 
Advertisement
Advertisement