తెలుగమ్మాయి కావడం నాకు ప్లస్ | Ustaad Theatrical Trailer Release | Sakshi
Sakshi News home page

Kavya Kalyan Ram: తెలుగమ్మాయి కావడం నాకు ప్లస్

Aug 10 2023 5:33 AM | Updated on Aug 10 2023 7:19 AM

Ustaad Theatrical Trailer Release - Sakshi

‘‘తెలుగు పరిశ్రమలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావటం లేదని ఎందుకు అంటున్నారో అర్థం కావటం లేదు. సావిత్రి, శ్రీదేవి.. వంటి తెలుగు హీరోయిన్లు పెద్ద సక్సెస్‌ను సాధించారు. ఇండియా వైడ్‌ వాళ్ల కంటే సక్సెస్‌ను ఎవరూ చూడలేదు. నా విషయానికొస్తే తెలుగు అమ్మాయి కావటం నాకు ప్లస్‌’’ అని కావ్య కల్యాణ్‌ రామ్‌ అన్నారు. శ్రీ సింహా కోడూరి, కావ్య జంటగా నటించిన చిత్రం ‘ఉస్తాద్‌’. ఫణిదీప్‌ దర్శకత్వంలో రజినీ కొర్రపాటి, రాకేష్‌ రెడ్డి గడ్డం, హిమాంక్‌ రెడ్డి దువ్వూరు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలవుతోంది.

ఈ సందర్భంగా కావ్య కల్యాణ్‌ రామ్‌ మాట్లాడుతూ– ‘‘ఉస్తాద్‌’లో సూర్య అనే పాత్రలో శ్రీ సింహా కనిపిస్తారు. తన బైక్‌ను ఉస్తాద్‌ అని పిలుచుకుంటుంటాడు. ఇందులో సూర్య ప్రేయసి మేఘనగా నటించాను. నా పాత్ర నేటి తరం అమ్మాయిలకు కనెక్ట్‌ అవుతుంది. ఇవాళ రజనీకాంత్‌గారి ‘జైలర్‌’, శుక్రవారం చిరంజీవిగారి ‘భోళా శంకర్‌’, శనివారం మా ‘ఉస్తాద్‌’ రిలీజవుతున్నాయి. ఆ ఇద్దరు లెజెండ్స్‌ సినిమాలను చూసే ప్రేక్షకుల్లో సగం మంది అయినా మా సినిమాను చూస్తే చాలు. మా సినిమా హిట్‌’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement