టాలీవుడ్ సెలబ్రిటీలు ప్రొఫెషనల్ పనులతోనే బిజీగా ఉండకుండా కాస్త పర్సనల్ లైఫ్‌పైనా ఓ కన్నేశారు. జీవితంలో ఓ అడుగు, కాదు కాదు.. ఏడడుగుల బంధంలోకి వెళ్లే ప్లాన్స్ చేస్తున్నారు. ఇప్పటికే విజయ్ దేవరకొండ, అల్లు శిరీష్ పెళ్లి చేసుకుని సెటిలయ్యారు. అటు బెల్లంకొండ శ్రీనివాస్ తనకు కాబోయే భార్యను పరిచయం చేశాడు.
ఆ సినిమా నుంచే లవ్
ఇప్పుడీ జాబితాలోకి ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి కుమారుడు, సింగర్ కాలభైరవ చేరనున్నట్లు తెలుస్తోంది. బలగం హీరోయిన్ కావ్య కల్యాణ్‌రామ్‌తో అతడు ప్రేమలో ఉన్నట్లు కొంతకాలంగా నెట్టింట రూమర్స్ హల్‌చల్ చేస్తున్నాయి. ఉస్తాద్ సినిమా సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందట! కాలభైరవ తమ్ముడు శ్రీసింహ హీరోగా నటించిన ఈ చిత్రంలో కావ్య కథానాయికగా నటించింది.
హింట్ ఇచ్చారా?
అలా ఈ మూవీ సెట్‌లో వీరికి ఏర్పడిన పరిచయం రానురానూ ప్రేమబంధంగా మారిందట! వీళ్ల ప్రేమాయణానికి పెద్దలు సైతం పచ్చజెండా ఊపారని, త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో కావ్య, కాల భైరవ ఓ కార్యక్రమానికి జంటగా వెళ్లారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. అంటే తాము ప్రేమలో ఉన్నమాని సిగ్నల్స్ ఇచ్చేశారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
సినిమా
కావ్య కల్యాణ్ రామ్ విషయానికి వస్తే.. భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన ఈమె గంగోత్రి మూవీలో బాలనటిగా యాక్ట్ చేసింది. స్నేహమంటే ఇదేరా, ఠాగూర్, బాలు, బన్నీ, పాండురంగడు.. ఇలా అనేక సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా మెప్పించింది. 2022లో వచ్చిన మసూదతో హీరోయిన్‌గా మారింది. బలగం చిత్రంతో ప్రేక్షకులకు దగ్గరైంది. కాలభైరవ విషయానికి వస్తే.. 2019లో వచ్చిన మత్తు వదలరా మూవీతో సంగీత దర్శకుడిగా మారాడు.
కెరీర్
కలర్ ఫోటో, ఆకాశవాణి, లక్ష్య, కార్తికేయ 2, గుర్తుందా శీతాకాలం, మోగ్లీ, మత్తు వదలరా 2, యుఫోరియా.. వంటి పలు చిత్రాలకు సంగీత దర్శకుడిగా పని చేశాడు. బాహుబలి 2లో పాడిన దండాలయ్యా.. పాట సింగర్‌గా అతడికి మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆర్‌ఆర్‌ఆర్ మూవీలో రాహుల్ సిప్లిగంజ్‌తో కలిసి పాడిన నాటు నాటు పాట ఏకంగా ఆస్కార్ గెల్చుకుంది. అదే చిత్రంలోని కొమురం భీముడో పాటకుగానూ కాలభైరవకు జాతీయ అవార్డు వచ్చింది.
Manollani nenu chala sarlu theatres lo, Restaurants lo chusanu naku appude theda kottindhi. Relation lo unnaru ani ardhamaindhi. Finally Book launch event ki kalisi vaccharu. Andhariki Hint ivvadaniki 🥰🥰
Chudali e celebrate couple aina life long unte bagundu❤️❤️🥹🥹 pic.twitter.com/ILVGBRQ7pM— Swaasthi (@swaasthi) March 24, 2026
చదవండి: బ్యాండ్‌మేళం కోసం చిరంజీవినే రిస్క్‌లో పడేసిన కోన వెంకట్


