చిరంజీవిని రిస్క్‌లో పడేసిన కోన వెంకట్‌! | Kona Venkat Says Dont Watch My Films if you Dislike Band Melam Movie | Sakshi
Sakshi News home page

Kona Venkat: బ్యాండ్‌మేళం నచ్చకపోతే నా సినిమాలు చూడకండి

Mar 24 2026 12:46 PM | Updated on Mar 24 2026 1:07 PM

Kona Venkat Says Dont Watch My Films if you Dislike Band Melam Movie

ఒకప్పుడు ఇండస్ట్రీలో పేరుమోసిన రచయితగా గుర్తింపు తెచ్చుకున్నాడు కోన వెంకట్‌. అమ్మనాన్న ఓ తమిళ అమ్మాయి, శివమణి, వెంకీ, ఢీ, రెడీ, అదుర్స్‌, దూకుడు, అల్లుడు శీను, నిన్ను కోరి. ఇలా అనేక హిట్‌ సినిమాలకు కథారచయితగా పని చేశాడు. అయితే ఒకానొక సమయంలో ఓ వెలుగు వెలిగిన కోన వెంకట్‌ తర్వాత వరుస వైఫల్యాలు చూసేసరికి నెమ్మదిగా సైడ్‌ అయిపోయాడు. రైటర్‌గా చాలావరకు సినిమాలు తగ్గించేశాడు.

కోన వెంకట్‌కు బూస్ట్‌
అలాంటి కోన వెంకట్‌కు 'వాల్తేరు వీరయ్య'తో మళ్లీ ఎనర్జీ వచ్చినట్లయింది. బాబీ డైరెక్ట్‌ చేసిన ఈ బ్లాక్‌బస్టర్‌ మూవీకి కోన రచనా సహకారం అందించాడు. ఇకపోతే వీరి కాంబినేషన్‌లో మరోసారి రిపీట్‌ అవుతున్న విషయం తెలిసిందే! చిరంజీవి-బాబీ సినిమాకు కోన రచనా సహకారం అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు.

అప్పుడు నాని చాలెంజ్‌
కోన వెంకట్‌ నిర్మాణంలో తెరకెక్కిన తాజా చిత్రం 'బ్యాండ్‌ మేళం'. కోర్ట్‌ జంట హర్ష్‌ రోషన్‌, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ మార్చి 26న విడుదల కానుంది. తాజాగా ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో కోన వెంకట్‌ చిరంజీవి సినిమాకు పని చేస్తున్నట్లు తెలిపాడు. అదే సమయంలో ఓ ఆసక్తికర ఛాలెంజ్‌ విసిరాడు. కోర్ట్‌ సినిమా రిలీజ్‌కు ముందు నాని ఓ మాటన్నాడు. ఈ మూవీ నచ్చకపోతే ఇంకెప్పుడూ తన సినిమా చూడవద్దన్నాడు. ఆ మాట చెప్పడానికి చాలా గుండెధైర్యం కావాలి. 

సీరియస్‌గా చెప్తున్నా..
ఇప్పుడు నేనూ చెప్తున్నా.. ఈ సినిమా మీకు నచ్చకపోతే నేను రాసే సినిమాలను మీరెవరూ చూడకండి. ఇది నేను సరదాకి చెప్పడం లేదు.. నిజంగానే ఈ మూవీ నచ్చకపోతే నా సినిమాలు చూడకండి. అలాగని రాయడం మానేయను, మీకు నచ్చేంతవరకు కథలు రాస్తూనే ఉంటాను. ఇప్పుడిది చూశారంటే చిరంజీవిగారు కోప్పడతారు. ఎందుకంటే నేను నెక్స్ట్‌ రాస్తున్న సినిమా ఆయనదే! అన్నాడు. అలా చిరు-బాబీ కాంబినేషన్‌లో రాబోయే సినిమాకు తాను రైటర్‌ అని కోన వెంకట్‌ వెల్లడించాడు. మొత్తానికి ఈ ఓపెన్‌ ఛాలెంజ్‌తో చిరు-బాబీ సినిమాను రిస్కులో పడేశాడు.

చదవండి: రామ్‌చరణ్‌, మహేశ్‌బాబుకు అలా.. కానీ,, : బండ్ల గణేశ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement