తమ్ముడితో మూవీ.. అన్నతో పెళ్లి.. హాట్‌టాపిక్‌గా బలగం బ్యూటీ..! | Kavya Kalyanram Interesting story about her Marriage announcement | Sakshi
Sakshi News home page

Kavya Kalyanram: తమ్ముడితో మూవీ.. అన్నతో పెళ్లి.. హాట్‌టాపిక్‌గా బలగం బ్యూటీ..!

Sep 1 2026 3:59 PM | Updated on Sep 1 2026 4:08 PM

Kavya Kalyanram Interesting story about her Marriage announcement

బలగం బ్యూటీ కావ్య కల్యాణ్ రామ్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రముఖ టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ కాల భైరవతో ఏడడుగులు వేయనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అఫీషియల్‌గా ప్రకటించింది. కాల భైరవతో రిలేషన్‌లో ఉన్నట్లు వెల్లడించింది.

అయితే కావ్య కల్యాణ్ రామ్ బలగం మూవీతో ఫేమ్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసింది. ఉస్తాద్ మూవీలో కాల భైరవ తమ్ముడు సింహా సరసన హీరోయిన్‌గా మెప్పించింది. ఇప్పుడేమో హీరో అన్న కాల భైరవతో పెళ్లికి రెడీ అయిపోయింది. ఇది కాస్తా టాలీవుడ్‌లో ఆసక్తికర విషయంగా మారింది.

తమ్ముడితో సినిమా చేసిన బ్యూటీ.. రియల్‌ లైఫ్‌లో అన్నతో జోడీ కట్టడంపై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో కొందరు హీరోయిన్లు కూడా ఇలానే చేశారని చర్చించుకుంటున్నారు. శ్రీదేవి–బోనీ కపూర్‌, శ్రియా రెడ్డి–విక్రమ్ రెడ్డి, సోనియా అగర్వాల్–సెల్వరాఘవన్ జంటలు కూడా ఇలానే చేశారని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement