ఖమ్మంలో ‘బేబమ్మ’ సందడి.. ‘ఉప్పెన’లా ఎగసిపడ్డ జనం | Uppena Hero Vaishnav Tej Heroine Krithi Shetty Visits Khammam | Sakshi
Sakshi News home page

ఖమ్మంలో ‘బేబమ్మ’ సందడి.. ఉప్పెనలా ఎగసిపడ్డ జనం

Apr 3 2021 3:08 PM | Updated on Apr 3 2021 5:46 PM

Uppena Hero Vaishnav Tej Heroine Krithi Shetty Visits Khammam - Sakshi

‘ఉప్పెన’ మూవీతో మెగా మేనల్లుడు పంజా వైష్ణశ్‌ తేజ్, కృతి శెట్టీలు హీరోహీరోయిన్లుగా వెండితెరకు పరిచమయ్యారు. మొదటి చిత్రంతోనే వైష్ణవ్‌, కృతీలు భారీ సక్సెస్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు. ఆర్సీగా వైష్ణవ్‌ తన అమాయకంతో, బేబమ్మగా కృతి అందం, అభినయనంతో ప్రేక్షకులను కట్టిపడేశారు. దీంతో ఈ క్యూట్‌ జోడికి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెరిగిపోయిందని చెప్పడంలో అతిశయోశక్తి లేదు. దీనికి ఈ తాజా సంఘటనే ఉదాహరణ. ఖమ్మంలోని కేఎల్‌ఎం షాపింగ్‌ మాల్‌ ఓపెనింగ్‌కు బేబమ్మ-ఆర్సీలు ముఖ్య అతిథులుగా హజరై షోరూంను ప్రారంభించారు. దీంతో వీరిని చూసేందుకు జనం వేల సంఖ్యలో తరలివచ్చారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. వైష్ణవ్‌, కృతీలను చూసేందుకు ‘ఉప్పెన’లా ఎగిసిపడ్డ జనసంద్రాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కాగా లాక్‌డౌన్‌ తర్వాత విడుదలై సినిమాల్లో  ‘ఉప్పెన’ 100 కోట్ల క్లబ్‌లో చేరిన మొదటి సినిమాగా గుర్తింపు పొందింది. దీంతో ఈ మూవీ హీరోహీరోఇయన్‌, దర్శకుడు పలు కార్యక్రమాల్లో పాల్గొంటు బిజీ అయిపోయారు. వీరికి ఉప్పెన నిర్మాతల‌ నుంచి విలువైన బహుమతులు అందాయి. ఇటీవల బచ్చిబాబు సనాకు మైత్రీ మూవీ మేకర్స్‌ విలువైన బెంజ్‌ కారు బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే.

చదవండి: 
‘ఉప్పెన’ డిలీటెడ్‌ సీన్‌.. ఆ అమ్మాయి కాళ్లు పట్టుకున్న వైష్ణవ్‌ 
ఎన్టీఆర్ కొత్త సినిమా: 60 ఏళ్ల మాజీ వృద్ధ ఆటగాడిగా..!

Advertisement
 
Advertisement
Advertisement