ఎన్టీఆర్ కొత్త సినిమా: 60 ఏళ్ల మాజీ వృద్ధ ఆటగాడిగా..!

Jr NTR To Act As 60 Years Old Man In Uppena Director Movie - Sakshi

దర్శకుడు బుచ్చిబాబు సన మొదటిసారిగా దర్శకత్వం వహించి తెరకెక్కించిన ‘ఉప్పెన’ చిత్రం ఇటీవల విడుదలైన బాక్సాఫీసు వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దీంతో ఇండస్ట్రీలో ఒక్కసారిగా ఆయన క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది. దీంతో బుచ్చిబాబుతో పని చేసేందుకు స్టార్ హీరోలు, నిర్మాతలు ఆసక్తిని చూపుతున్నారు. ఈ క్రమంలో బుచ్చి డైరెక్షన్‌లో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌తో ఓ మూవీ రూపొందనున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

తాజా సమాచారం ప్రకారం బుచ్చి ఎన్టీఆర్‌ కోసం స్పోర్ట్స్‌ బెస్డ్‌ స్ర్కిప్ట్‌ను సిద్దం చేశాడట. పిరియాడికల్‌ స్పోర్ట్స్‌ నేపథ్యంలో రూపొందే ఈ చిత్రం హిందీ మూవీ దంగల్‌ తరహాలో ఉండనుందట. ఇందులో ఎన్టీఆర్‌ 60 ఏళ్ల మాజీ ఆటగాడి పాత్ర చూట్టు ఈ కథ తిరగనుంది. కాగా ఇటీవల ఎన్టీఆర్‌ను కలిసి బుచ్చి కథ వివరించినట్లు తెలుస్తోంది. అయితే ఇంతవరకు దీనిపై ఎన్టీఆర్‌ స్పందించలేదని ఆయన గ్రీన్‌ సిగ్నిల్‌ కోసం మైత్రీ మూవీ మేకర్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు సమచారం. 

ఒకవేళ అంతా ఒకే అయితే ఈ చిత్రాన్ని మైత్రి మూవీ సంస్థ నిర్మించనుంది. కాగా బుచ్చి బాబు ఇప్పటికే కింగ్‌ నాగార్జున తనయుడు అఖిల్‌ అక్కినేని కోసం ఓ మంచి ప్రేమకథ సిద్దచేయమని బచ్చిబాబుకు ప్రపోజల్‌ పెట్టినట్లు కడా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్‌ రాజమౌళీ డైరెక్షన్‌లో మల్టీస్టారర్‌ మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్‌ షెడ్యూల్‌ చివరి దశలో ఉండటంతో ఎన్టీఆర్‌ తన తదుపరి చిత్రం ‘కేజీఎఫ్‌’ ఫేం ప్రశాంత్‌ నీల్‌తో చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 

చదవండి: 
ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో ఎన్టీఆర్‌ మూవీ..?!

భార్య, కూతురు ఫొటో షేర్‌ చేసిన బన్నీ
‘నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత’

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top