పండగ వేళ పసందుగా... | Upcoming Movies Updates for Diwali festival 2024: Tollywood | Sakshi
Sakshi News home page

పండగ వేళ పసందుగా...

Nov 2 2024 12:59 AM | Updated on Nov 2 2024 12:59 AM

Upcoming Movies Updates for Diwali festival 2024: Tollywood

కొత్త లుక్స్, విడుదల తేదీల ప్రకటనలతో దీపావళి సందడి తెలుగు పరిశ్రమలో బాగానే కనిపించింది. మాస్‌ లుక్, క్లాస్‌ లుక్, భయంకరమైన లుక్, కామెడీ లుక్‌... ఇలా పండగ వేళ పసందైన వెరైటీ లుక్స్‌లో కనిపించారు స్టార్స్‌. 

ఆ వివరాల్లోకి వెళదాం.
తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లోని స్టార్‌ హీరోలైన అక్కినేని నాగార్జున,  ధనుష్ లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్న పాన్‌ ఇండియన్‌ మల్టిస్టారర్‌ చిత్రం ‘కుబేర’. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్న హీరోయిన్‌గా నటిస్తున్నారు. సునీల్‌ నారంగ్, పుసూ్కర్‌ రామ్మోహన్‌ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీపావళి సందర్భంగా ధనుష్, నాగార్జున, రష్మికా మందన్నల పోస్టర్‌ని విడుదల చేశారు మేకర్స్‌. టీజర్‌ని ఈ నెల 15న విడుదల చేయనున్నారు. తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది.   

హీరో వెంకటేశ్‌ వచ్చే సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్‌ని ఖరారు చేసి టైటిల్, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. అనిల్‌ రావిపూడి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ‘దిల్‌’ రాజు సమర్పణలో శిరీష్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేశ్‌ భార్య పాత్రలో ఐశ్వర్యా రాజేష్, మాజీ ప్రేయసిగా మీనాక్షీ చౌదరి నటిస్తున్నారు. దీపావళిని పురస్కరించుకుని ఈ మూవీ టైటిల్, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేయడంతో పాటు సినిమాని సంక్రాంతికి రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించారు. యూనిక్‌ ట్రయాంగిలర్‌ క్రైమ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం రూపొందుతోంది.  

సంక్రాంతికి ఆట ప్రారంభించనున్నారు రామ్‌చరణ్‌. ఆయన హీరోగా నటిస్తున్న పాన్‌ ఇండియన్‌ మూవీ ‘గేమ్‌ ఛేంజర్‌’. దర్శకుడు శంకర్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ జీ స్టూడియోస్‌ బ్యానర్స్‌పై ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 10న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. కాగా ఈ మూవీ టీజర్‌ని ఈ నెల 9న విడుదల చేస్తున్నట్లు ప్రకటించి, రామ్‌చరణ్‌ లుక్‌ని రిలీజ్‌ చేశారు. 

అర్జున్‌ సర్కార్‌గా చార్జ్‌ తీసుకున్నారు హీరో నాని. ‘హిట్‌: ది ఫస్ట్‌ కేస్‌’, ‘హిట్‌: ది సెకండ్‌ కేస్‌’ వంటి చిత్రాల తర్వాత ఆ ఫ్రాంచైజీలో రూపొందుతున్న చిత్రం ‘హిట్‌: ది థర్డ్‌ కేస్‌’. తొలి రెండు చిత్రాలకు దర్శకత్వం వహించిన శైలేష్‌ కొలను ‘హిట్‌: ది థర్డ్‌ కేస్‌’ని కూడా తెరకెక్కిస్తున్నారు. శ్రీనిధీ శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. వాల్‌ పోస్టర్‌ సినిమా, యునానిమస్‌ప్రొడక్షన్స్‌పై ప్రశాంతి తిపిర్నేని ఈ మూవీ నిర్మిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఈ మూవీ నుంచి నాని యాక్షన్‌ ఫ్యాక్డ్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. 2025 మే 1న ఈ సినిమా విడుదల కానుంది. 

నితిన్‌ టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘రాబిన్‌హుడ్‌’. ఇందులో శ్రీలీల హీరోయిన్‌. వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నితిన్‌ లుక్‌ విడుదలైంది. త్వరలో టీజర్‌ రిలీజ్‌ కానుంది. యునిక్‌ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్‌ 20న రిలీజ్‌ కానుంది. 

నవీన్‌ చంద్ర హీరోగా లోకేశ్‌ అజ్లస్‌ దర్శకత్వంలో రూపొందిన ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ మూవీ ‘లెవెన్‌’. రేయా హరి కథానాయికగా నటించారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో అజ్మల్‌ ఖాన్, రేయా హరి ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా ఈ చిత్రంలోని ‘ది డెవిల్‌ ఈజ్‌ వెయిటింగ్‌..’ అంటూ శ్రుతీహాసన్‌ పాడిన పాట చాలా పాపులర్‌ అయింది. ‘లెవెన్‌’ని నవంబర్‌ 22న విడుదల చేయనున్నట్లు యూనిట్‌ ప్రకటించింది.  

బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్‌ తాత–మనవళ్లుగా నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. నూతన దర్శకుడు ఆర్‌వీఎస్‌ నిఖిల్‌ దర్శకత్వంలో రాహుల్‌ యాదవ్‌ నక్కా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బ్రహ్మానందంగా రాజా గౌతమ్‌ పోషిస్తున్న పాత్ర ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేశారు. ఇందులో ప్రియా వడ్లమాని, ఐశ్వర్యా హోలక్కల్‌ హీరోయిన్లు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న ఈ చిత్రం రిలీజ్‌ కానుంది.

నాగ సాధువుగా తమన్నా లీడ్‌ రోల్‌లో అశోక్‌ తేజ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఓదెల 2’. మధు క్రియేషన్స్, సంపత్‌ నంది టీమ్‌ వర్క్స్‌పై బహు భాషా చిత్రంగా రూపొందుతోంది. ఈ డివోషన్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌లో విలన్‌ తిరుపతి పాత్రలో వశిష్ఠ ఎన్‌. సింహ నటిస్తున్నట్లు పేర్కొని, లుక్‌ని విడుదల చేశారు. ఈ చిత్రంలో హెబ్బా పటేల్‌ మరో కీలక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement