
మెగా హీరో రామ్ చరణ్.. 13 ఏళ్ల క్రితం ఉపాసనని పెళ్లి చేసుకున్నాడు. అయితే వివాహం తర్వాత లో ప్రొఫైల్ మెంటైన్ చేస్తూ వచ్చారు గానీ గత కొన్నేళ్లలో మాత్రం సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. అలా ఇప్పుడు ఓ ఫుడ్ వ్లాగ్స్ చేసే హిందీ యూట్యూబర్.. ఉపాసనని ఇంటర్వ్యూ చేసింది. స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి, ఫుడ్ తింటూ ఆనాటి సంగతుల్ని అడిగింది. ఈ క్రమంలోనే పెళ్లికి ముందు రామ్ చరణ్‌కి పెట్టిన లవ్ టెస్ట్ గురించి ఉపాసన బయటపెట్టింది.
(ఇదీ చదవండి: నేనెవరిని కలవలేదు.. క్లారిటీ ఇచ్చిన చిరంజీవి)
చరణ్-ఉపాసనలది పెద్దల కుదిర్చిన సంబంధమే అయినప్పటికీ.. పెళ్లికి ముందే కొన్నాళ్లు డేటింగ్ చేశారు. ఆ సమయంలో ఓ రోజు ఉపాసన.. 'చరణ్ నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే 'ఫేమస్ ఐస్ క్రీమ్' షాప్‌కి తీసుకెళ్లు అని అడిగాను. అప్పుడు మా ఫ్యామిలీ ఓల్డ్ సిటీకి దగ్గరలో ఉండేవాళ్లం. అక్కడే మొజంజాహి మార్కెట్‌లో ఫేమస్ ఐస్ క్రీం షాప్ ఉంటుంది. అక్కడ ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది. అది నా ఫేవరెట్'
'హైదరాబాద్‌లో ఉన్న పాత ఐస్ క్రీమ్ షాప్స్‌లో అదొకటి. అది మార్కెట్ మధ్యలో ఉంటుంది. అప్పటికే చరణ్ స్టార్. అందరూ గుర్తుపడతారు. అయినా సరే నేను అడిగానని ఓకే చెప్పి తీసుకెళ్లాడు. ఐస్ క్రీమ్ ఆర్డర్ చేశాడు. కానీ అక్కడి జనాలు చరణ్‌ని గుర్తుపట్టి మమ్మల్ని చుట్టుముట్టేశారు. నేను అతడికి పెట్టిన నిజమైన లవ్ టెస్ట్ అదే' అని చెప్పుకొచ్చింది.
(ఇదీ చదవండి: మెగా కోడలికి తెలంగాణ సర్కారు కీలక బాధ్యతలు)
అలానే తమ కుటుంబంలో ప్రారంభించిన 'అత్తమ్మాస్ కిచెన్' ఎలా ప్రారంభమైందో కూడా ఉపాసన చెప్పుకొచ్చింది. 'మా ఇంట్లో అందరూ బాగా తింటారు. బాగా వండుతారు కూడా. మేం వేరే దేశాలకు వెళ్లినప్పుడు బెస్ట్ రెస్టారెంట్స్‌కి వెళ్తాం. అయినా సరే అక్కడ రాత్రయ్యేసరికి.. సౌత్ ఇండియన్ ఫుడ్ కావాలని చరణ్ అడుగుతాడు. ఆ టైంలో ఇండియన్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది. బయట దేశాలకు వెళ్లినప్పుడు ఇలా చరణ్ చాలా కష్టపడేవాడు. అలా అత్తమ్మాస్ కిచెన్ ఆలోచన వచ్చింది' అని చెప్పింది.
'అయితే ఈ బిజినెస్ గురించి తొలుత మా అత్తమ్మకు(సురేఖ) చెబితే ఎందుకు అని అన్నారు. విదేశాలకు వెళ్లినా మనలానే చాలామంది సౌత్ ఇండియన్ ఫుడ్ వెతుక్కోవడం కష్టం. అందుకే ఈ బిజినెస్ అని చెప్పాను. ఈ బిజినెస్‌కి చాలా పేర్లు అనుకున్నాం కానీ చివరకు అత్తమ్మాస్ కిచెన్ అని ఫిక్సయ్యాం' అని ఉపాసన చెప్పుకొచ్చింది.
(ఇదీ చదవండి: రామ్ చరణ్ అత్తకు ఇంత టాలెంట్ ఉందా?)