మెగాస్టార్ విషెస్.. మెగా కోడలు ఉపాసన రియాక్షన్‌ | Upasana Konidela Reaction On Megastar Chiranjeevi Special Birthday Wishes To Ram Charan, Check Post Went Viral | Sakshi
Sakshi News home page

Upasana: చెర్రీకి మెగాస్టార్ విషెస్.. మెగా కోడలి కామెంట్

Mar 27 2026 7:34 PM | Updated on Mar 28 2026 1:29 PM

Upasana comment Om Megastar Chiranjeevi wishes to Ram charan birthday

గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌కు పుట్టినరోజు వేడుకను మెగాస్టార్ ఫ్యామిలీ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటోంది. ఇవాళ తనయుడి బర్త్ డే కావడంతో వృద్ధులకు భోజనాలు వడ్డించారు. చిరంజీవి ‍బ్లడ్‌ బ్యాంక్‌లో ఈ వేడుక నిర్వహించారు. అంతకుముందు తనయుడు రామ్ చరణ్‌పై తన ప్రేమను చాటుకున్నారు. చరణ్‌ బాల్యంలో జరుపుకున్న పుట్టినరోజు ఫోటోను అభిమానులతో మెగాస్టార్‌ పంచుకున్నారు.

తాజాగా మెగాస్టార్ చేసిన పోస్ట్‌కు మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల స్పందించింది.  మా చిన్న కూతురు అన్వీరా దేవి.. అచ్చం నాన్న రామ్ చరణ్‌ లాగే ఉంటుందని కామెంట్ చేసింది. కాగా.. ఈ ఏడాది జనవరి 31 ఉపాసన కవల పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. వీరికి అన్వీరా దేవి, శివరామ్ అనే పేర్లు పెట్టారు. అంతకుముందు ఈ జంటకు ఓ పాప పుట్టగా.. క్లీంకార అని నామకరణం చేశారు. 

 

Advertisement
 
Advertisement
Advertisement