నాతో డేటింగ్‌ అంటే ఆమెకు పెళ్లి అయినట్లే: టాప్‌ హీరో | Unni Mukundan Clarify Dating And Marriage Rumours With Anusree - Sakshi
Sakshi News home page

'జనతా గ్యారేజ్‌' నటుడితో అనుశ్రీ డేటింగ్‌..ఒత్తిడిలో హీరోయిన్‌

Apr 2 2024 11:10 AM | Updated on Apr 2 2024 12:46 PM

Unni Mukundan Clarified Geting Married With Anu Sri - Sakshi

మలయాళ హీరో ఉన్ని ముకుందన్..  జనతా గ్యారేజ్‌,భాగమతి, యశోద చిత్రాలతో తెలుగు వారికి బాగా దగ్గరయ్యాడు. శబరిమల బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కించిన 'మాలికాపురం' అనే చిత్రం కూడా మంచి విజయాన్ని అందుకుంది. గత కొద్దిరోజులుగా హీరోయిన్‌ అనుశ్రీతో డేటింగ్‌లో ఉన్నాడని, త్వరలో పెళ్లి కూడా చేసుకోనున్నారని వార్తలు తెగ ట్రెండ్‌ అయ్యాయి. ఈ విషయంపై ఆయన రియాక్ట్‌ అయ్యారు.

ఉన్ని ముకుందన్ ప్రస్తుతం తన తదుపరి చిత్రం జై గణేష్ ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. ఏప్రిల్ 11న ఈ చిత్రం విడుదల కానుంది. మలయాళ చిత్రసీమలోని అతికొద్ది మంది బ్యాచిలర్‌లలో ఒకరైన కారణంగా, ఆయన తరచుగా తన సహనటులతో డేటింగ్ పుకార్లలో చిక్కుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు ఆ లిస్ట్‌లో నటి అనుశ్రీతో ఉన్ని ముకుందన్ రిలేషన్‌లో ఉన్నాడని వార్తలు వ్యాపించాయి. 

ఈ పుకార్లకు తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన ఇలా చెప్పాడు. అనుశ్రీతో ఒక సినిమా మాత్రమే చేయబోతున్నాను. ఇండస్ట్రీలో నా పేరు తరచుగా ఇతర హీరోయిన్‌లతో ముడిపెడుతూ రూమర్స్‌ క్రియేట్‌ చేస్తున్నారు. అది నాకు చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుది. గతంలో కూడా ఇలాగే డేటింగ్‌లో ఉన్నానంటూ పలువురి హీరోయిన్లతో లింక్‌ పెట్టారు. ఇప్పుడు ఆ హీరోయిన్లు అందరు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నారు. ప్రస్తుతం నాతో డేటింగ్ రూమర్స్ కారణంగా అనుశ్రీ కూడా త్వరలో పెళ్లి చేసుకోనుంది అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చాడు.

ప్రస్తుతానికి అయితే నేను ఎవరితోనూ డేటింగ్‌లో లేను. కానీ ఈ రూమర్స్‌ ఎలా వస్తున్నాయో నాకు అర్థం కావడం లేదు. ఈ రూమర్స్‌ వల్ల అనుశ్రీ కాస్త ఒత్తిడికి గురికావచ్చు. ఎందుకంటే ఆమె ఇలాంటి పుకారులలో చిక్కుకోవడం ఇదే మొదటిసారి, కానీ నాకు ఇలాంటివి అలవాటే..' అని ఆయన క్లారిటీ ఇచ్చారు. 

Advertisement
 
Advertisement
Advertisement