సల్మాన్ ఖాన్‌ ఇంటి వద్ద కాల్పులు.. ఇద్దరు అరెస్ట్ | Two Accused Persons Arrested In Salman Khan Case Issue | Sakshi
Sakshi News home page

సల్మాన్ ఖాన్‌ ఇంటి వద్ద కాల్పులు.. ఇద్దరు అరెస్ట్

Apr 16 2024 10:12 AM | Updated on Apr 16 2024 10:31 AM

Two Accused Persons In Salman Khan Case Issue - Sakshi

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్ ఇంటి ముందు ఏప్రిల్‌ 14న కాల్పులు జరిపిన వారిని ముంబై పోలీసులు అరెస్ట్‌ చేశారు. రెండు రోజుల క్రితం ముంబైలోని సల్మాన్‌  గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌  వద్ద ఇద్దరు దుండగులు ఆరు రౌండ్ల కాల్పులు జరిపి ఆపై మోటార్ ​సైకిల్​ ద్వారా పారిపోయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కేసు నమోదు చేసిన పోలీసులు దర్వాప్తులో వేగం పెంచారు.

సల్మాన్‌ ఖాన్‌ ఇంటి ముందు కాల్పులు జరగడంతో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో వెంటనే పోలీసులు అలర్ట్‌ అయ్యారు.  ఈ కాల్పుల ఘటనలో  విక్కీ గుప్తా(24), సాగర్ పాల్ (21) నిందితులుగా గుర్తించిన ముంబై పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్‌లోని భుజ్‌లో వారిద్దరిని అరెస్టు చేసినట్లు తాజాగా వెళ్లడించారు.

షూటర్లు ఇద్దరూ బీహార్‌లోని పశ్చిమ చంపారన్‌కు చెందినవారని పోలీసులు తెలిపారు. గతంలో వారిద్దరిపై చాలా చైన్‌ స్నాచింగ్‌ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. నార్త్‌ ఇండియాలోని పలు రాష్ట్రాల్లో  దొంగతనాలు కూడా చేసినట్లు ఆధారాలు లభ్యమైనట్లు తెలిపారు. దొంగతనాలు చేస్తున్న క్రమంలో హత్యలు కూడా చేసి ఉండవచ్చు అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.  ఏప్రిల్‌ 14న కాల్పులు జరిగిన తర్వాత సల్మాన్ ఖాన్ సెక్యూరిటీ గార్డు వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. పదికి పైగా టీమ్‌లుగా విడిపోయి కేసును ఛేదించారు. వారిద్దరిని విచారించిన తర్వాత పూర్తి వివరాలు వెళ్లడిస్తామని వారు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement