
చెన్నై: ప్రముఖ బుల్లితెర నిర్మాత జె.కృష్ణస్వామి కరోనా మహమ్మారి బారిన పడి గురువారం చెన్నైలో కన్నుమూశారు. కుంభకోణంకు చెందిన ఈయన మొదట్లో కస్టమ్స్ శాఖలో ఉన్నత ఉద్యో›గం చేసేవారు. తర్వాత ఆయన బుల్లితెరకు పరిచయమయ్యారు. అభినయ క్రియేషన్స్ సంస్థ ద్వారా మాంభూమి కి మామియార్, మహారాణి సెంగమలం, గ్రీన్ సిగ్నల్, చెల్లమ్మ, దేవతై తదితర మెగా సీరియ ళ్లు నిర్మించారు. ఆయన వారం రోజుల క్రితం కరోనా బారిన పడడంతో స్థానిక క్రోంపేటలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి గురువారం మృతిచెందారు. ఆయన మృతికి బుల్లితెరకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.