డేటింగ్‌కు ఫుల్‌స్టాప్‌, పెళ్లితో ఒక్కటైన లవ్‌ బర్డ్స్‌ | TV Actress Shrenu Parikh Married To Boyfriend Akshay Mhatre | Sakshi
Sakshi News home page

Shrenu Parikh: ప్రియుడిని పెళ్లాడిన నటి.. జీవితాంతం ఈ చేయి విడవనంటూ..

Dec 22 2023 11:13 AM | Updated on Dec 22 2023 12:04 PM

TV Actress Shrenu Parikh Married to Boyfriend Akshay Mhatre - Sakshi

ఈ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన కొత్త పెళ్లికూతురు ఈ జీవితానికి అతడినే బుక్‌ చేసుకున్నానని రాసుకొచ్చింది.

బుల్లితెర జంట శ్రెను పరిఖ్‌, అక్షయ్‌ మాత్రే పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరూ 2021లో ప్రసారమైన 'ఘర్‌ ఏక్‌ మందిర్‌ కృపా అగ్రసేన్‌ మహారాజా కీ' అనే సీరియల్‌లో కలిసి నటించారు. అప్పటి నుంచే వీరిమధ్య సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌ స్టార్ట్‌ అయింది. ఈ ప్రేమను ఇరు కుటుంబాలు అంగీకరించాయి, పెళ్లికి పచ్చజెండా ఊపాయి. దీంతో శ్రెను సొంతూరైన గుజరాత్‌లోని వడోదరలో గురువారం(డిసెంబర్‌ 21న) వీరి వివాహం ఘనంగా జరిగింది.

అతడితోనే జీవితం..
తమ పెళ్లి ఫోటోలను ఈ నవదంపతులు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఇందులో శ్రెను రెడ్‌ అండ్‌ ఆరెంజ్‌ కలర్‌ లెహంగాలో ధగధగ మెరిసిపోయింది. అటు అక్షయ్‌ రెడ్‌ కలర్‌ షేర్వాణీ ధరించాడు. ఈ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన కొత్త పెళ్లికూతురు ఈ జీవితానికి అతడినే బుక్‌ చేసుకున్నానని రాసుకొచ్చింది.

సీరియల్స్‌తో గుర్తింపు
పెళ్లికి ముందు హల్దీ, మెహందీ, సంగీత్‌ వేడుకలు సైతం జరిగాయి. సంగీత్‌లో ఈ లవ్‌ బర్డ్స్‌ బాలీవుడ్‌ హిట్‌ సాంగ్స్‌కు స్టెప్పులేశారు. కాగా శ్రెను పరిఖ్‌.. ఏక్‌ భ్రమ్‌ సర్వగుణ్‌ సంపన్‌, ఇస్‌ ప్యార్‌ కో క్యా నామ్‌ ధూన్‌- ఏక్‌ బార్‌ ఫిర్‌, ఇష్క్‌బాజ్‌, ఘర్‌ ఏక్‌ మందిర్‌, జింగదగీ కా హర్‌ ర్యాంగ్‌, గులాల్‌.. వంటి పలు సీరియల్స్‌తో హిందీ ప్రేక్షకులకు దగ్గరైంది. అక్షయ్‌ మాత్రే.. ఇండియావాలీ మా సీరియల్‌లో నరేన్‌ వ్యాస్‌గా నటించి బోలెడంత గుర్తింపు తెచ్చుకున్నాడు.

చదవండి: సీనియర్‌ను ప్రేమించా.. అతడు కూడా ఇంట్రస్ట్‌ చూపించాడు.. అంతలోనే!

Advertisement
 
Advertisement
Advertisement