సీరియల్‌ నటి సీమంతం.. ఇది రెండోసారి! | TV Actress Gali Maheshwari Grand Baby Shower | Sakshi
Sakshi News home page

Maheshwari: గ్రాండ్‌గా బుల్లితెర నటి సీమంతం.. ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతోంది!

Apr 8 2024 12:32 PM | Updated on Apr 8 2024 1:18 PM

TV Actress Gali Maheshwari Grand Baby Shower - Sakshi

ఇప్పుడు మరోసారి ఆమె సీమంతం జరిగింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఈ వేడుక నిర్వహించారు. ఈ ఫంక్షన్‌కు సంబంధించిన ఫోటోలను నటి తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేసింది...

బుల్లితెర నటి మహేశ్వరి త్వరలో రెండోసారి తల్లి కాబోతోంది. ఇప్పటికే మెటర్నటీ ఫోటోషూట్లతో తెగ సందడి చేసింది. భర్త, కూతురితో కలిసి బేబీబంప్‌తో ఫోటోలకు ఫోజిచ్చింది. ఆ హంగామా అంతా ఎలా జరిగిందో కూడా వివరిస్తూ యూట్యూబ్‌లో వీడియోలు చేసింది. భార్య అంటే పంచప్రాణాలైన శివ తనకు జీవితాంతం గుర్తుండిపోయేట్లు గత నెలలో పెద్ద సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు.

మరోసారి సీమంతం
మహేశ్వరికి మాటైనా చెప్పకుండా అన్నీ అరేంజ్‌ చేసి సీమంతం చేశాడు. ఇప్పుడు మరోసారి ఆమె సీమంతం జరిగింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఈ వేడుక నిర్వహించారు. ఈ ఫంక్షన్‌కు సంబంధించిన ఫోటోలను నటి తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేసింది. నీలిరంగు చీరలో నిండా నగలు వేసుకుని ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతోంది మహేశ్వరి.

ఫ్యాన్స్‌ విషెస్‌
ఈ ఫోటోలు చూసిన అభిమానులు మహేశ్వరి దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా మహేశ్వరి.. వదినమ్మ, శశిరేఖ పరిణయం వంటి పలు సీరియల్స్‌లో నటించింది. ఫ్యామిలీ నెంబర్‌ 1, ఇస్మార్ట్‌ జోడీ 2 అనే రియాలిటీ షోలలో తన భర్త శివనాగ్‌తో కలిసి పార్టిసిపేట్‌ చేసింది. వీరికి హరిణి అనే కూతురు ఉంది.

చదవండి: మా వాడిని చూసి భయపడుతున్నారా.. ? విజయ్‌ మేనమామ కామెంట్లు వైరల్‌

Advertisement
 
Advertisement
Advertisement