నటితో బలవంతంగా వ్యభిచారం.. రక్షించిన పోలీసులు | TV actor rescued from human trafficking prostitution racket in Thane | Sakshi
Sakshi News home page

టీవీ నటితో బలవంతంగా వ్యభిచారం.. రక్షించిన పోలీసులు

Oct 11 2026 3:58 PM | Updated on Oct 11 2026 4:03 PM

TV actor rescued from human trafficking prostitution racket in Thane

మహారాష్ట్రలోని థానేలో మానవ అక్రమ రవాణా, వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.  ఈ ముఠా నుంచి హిందీ టీవీ సీరియళ్లు, వెబ్‌ సిరీస్‌లో నటించిన 35 ఏళ్ల నటిని రక్షించారు. వినోద రంగానికి చెందిన మహిళలను బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతున్నట్లు తొలిత విచారణలో వెల్లడైందని అధికారులు తెలిపారు. ఈ కేసులో ఓ మహిళను అరెస్టు చేయగా.. మరో వ్యక్తి కోసం అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. వివరాలివి..

ఓ స్వచ్ఛంద సంస్థ నుంచి పోలీసులకు పైవిధంగా సమాచారం అందింది. అక్టోబర్‌ 8న మీరా- భయందర్‌ రోడ్డులోని ఓ హోటల్‌కు నకిలీ కస్టమర్‌ను పంపించారు. ఆ తర్వాత అక్కడ దాడులు నిర్వహించి.. మహిళను వ్యభిచారంలోకి దింపేందుకు డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా ఈ ముఠా నుంచి రక్షించిన 35 ఏళ్ల నటిని ముంబైలోని రెస్క్యూ ఫౌండేషన్‌ సంరక్షణలో ఉంచారు. 

అదుపులో తీసుకున్న వ్యక్తితో పాటు మరో వ్యక్తి కలిసి.. టీవీ సీరియళ్లు, వెబ్‌ సిరీస్‌లు, షూటింగ్స్‌లో పాల్గొన్న మహిళలే లక్ష్యంగా చేసుకుని వారిని బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతున్నట్లు పోలీసులు తెలిపారు. 

(ఇదీ చదవండి: గమనించండి.. ఈ వీడియోలు వారికి మాత్రమే: సల్మాన్‌ ఖాన్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement