బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఓ కొత్త యూట్యూబ్ ఛానల్‌ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ ‘బీయింగ్ సల్మాన్ ఖాన్’ ఛానల్‌పై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
‘నా ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. అందులో ఉండే కంటెంట్ మీకు అంతగా నచ్చకపోవచ్చు. ఎందుకంటే అది మీకోసం కాదు. కేవలం చిన్న పిల్లల కోసమే. వినోదం, ప్రేమ, కుటుంబ బంధాలతో పాటు పిల్లలకు విద్య కూడా ఎంతో అవసరం కదా’ అని సల్మాన్ ఖాన్ పేర్కొన్నారు.
కాగా ఇందులో సల్మాన్‌ఖాన్ రెండు రకాల పాత్రల్లో కనిపిస్తారు. ఒకటి నటన నేర్పించే గురువుగా.. రెండోది విద్యార్థిగా.. బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, హావభావాలు తదితర అంశాలను పిల్లలకు అర్థమయ్యే విధంగా నేర్పించనున్నారు.
(ఇదీ చదవండి: బిగ్‌బీకి 84 ఏళ్లు.. రూ.90కోట్ల అప్పు.. రూ.4000 కోట్ల సామ్రాజ్యం!)


