ఇంద్రకీలాద్రి: ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikiram Srinivas) ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆదివారం నాడు కుటుంబ సమేతంగా ఆలయానికి వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. భార్య సౌజన్యతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. త్రివిక్రమ్ కుటుంబసభ్యుల పేరిట ప్రత్యేక అర్చనలు నిర్వహించారు ఆలయ అర్చకులు. అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.


