
రాజ్ తరుణ్ మోసం చేశాడంటూ అతడి ప్రియురాలు లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. హీరోయిన్ మాల్వీ మల్హోత్రా రాజ్ తరుణ్‌ను బుట్టలో వేసుకుందని, తన ప్రియుడిని తనకు కాకుండా చేసిందని ఆరోపించింది. అతడిని వదిలేయకపోతే తనను చంపేస్తామని మాల్వీ, ఆమె సోదరుడు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొంది. తాజాగా ఈ ఆరోపణలపై హీరో రాజ్ తరుణ్ స్పందించాడు.
డ్రగ్స్ అలవాటు
'లావణ్య.. మొదట్లో నాతో కలిసున్న మాట వాస్తవమే! నేను హైదరాబాద్‌కు వచ్చిన కొత్తలో నన్ను గైడ్ చేసింది. మేము రెండుమూడేళ్లు కలిసున్నాం. అయితే తనకు డ్రగ్స్ అలవాటు ఉంది. డ్రగ్స్ తీసుకోవద్దని ఎన్నోసార్లు చెప్పినా వినలేదు. నాకేమో డ్రగ్స్ వంటివి నచ్చవు. తన అలవాట్లు నచ్చక నేనే బయటకు వెళ్లిపోయాను. తనను అసలు పెళ్లే చేసుకోలేదు. నేను బయటకు వచ్చేశాక అదే గదిలో మస్తాన్ సాయి అనే వ్యక్తితో కలిసుంది.
మరొకరితో రిలేషన్
ప్రస్తుతం అతడితోనే రిలేషన్‌లో ఉంది. కానీ డబ్బు కోసం నాతో పని చేసేవారందరికీ ఫోన్లు చేసి బెదిరిస్తోంది. అలా మాల్వీ మల్హోత్రాకు ఫోన్ చేసి బెదిరించింది, బూతులు మాట్లాడింది. కొన్నేళ్ల క్రితమే నన్ను వదిలేసిన ఆమె ఇప్పుడు నేను కావాలని కోరుకోవడమేంటో అర్థం కావడం లేదు. నన్ను ఎంతగానో వేధించింది. పరువు పోతుందని ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్నాను. నేను కూడా తనపై పోలీసులకు ఫిర్యాదు చేయబోతున్నాను' అని చెప్పుకొచ్చాడు.
