పుష్ప-2 వాయిదా.. రేసులోకి వచ్చేసిన ఎన్టీఆర్‌ బామ్మర్ది! | Narne Nithiin’s Aay Movie Release Date Announced | Sakshi
Sakshi News home page

Narne Nithiin: పుష్ప-2 వాయిదా.. బాక్సాఫీస్ బరిలో ఎన్టీఆర్‌ బామ్మర్ది, రానా!

Jun 25 2024 1:47 PM | Updated on Jun 25 2024 3:00 PM

Tollywood Hero Narne Nithiin latest Movie Release On This Date

జూనియర్ ఎన్టీఆర్ బామ్మర్దిగా ఇండస్ట్రీకి పరిచయం హీరో నార్నెనితిన్. మ్యాడ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మొదటి మూవీతోనే సూపర్ హిట్‌ అందుకున్నాడు. తాజాగా నితిన్ హీరోగా నటిస్తోన్న చిత్రం 'ఆయ్'. అతనికి జంటగా నయన్ సారిక హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ సినిమాను జీఏ2 బ్యానర్‌పై అంజి కె.మ‌ణిపుత్ర‌ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని బన్నీ, విద్యా కొప్పినీడి నిర్మాతలుదా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ ఆయ్ మూవీ రిలీజ్ డేట్‌ ప్రకటించారు మేకర్స్. ఆగస్టు 15న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పాట‌లకి ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్‌ వస్తోంది. అయితే ఈ తేదీ విడుదల కావాల్సిన పుష్ప-2 వాయిదా పడడంతో చిన్న సినిమాలు క్యూ కడుతున్నాయి.

మరోవైపు అదే రోజున హీరో రానా నిర్మాతగా తెరకెక్కిస్తోన్న '35 – ఇది చిన్నకథ కాదు' రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ చిత్రంలో ప్రియదర్శి, నివేదా థామస్ జంటగా నటించారు. వీటితో రామ్ పోతినేని-పూరి కాంబోలో వస్తోన్న డబుల్ ఇస్మార్ట్‌ సినిమాను అదే రోజు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో టాలీవుడ్ బాక్సాఫీస్ బరిలో ఈ మూడు సినిమాలు పోటీ పడనున్నాయి. మరి ఏ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందో వేచి చూడాల్సిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement