
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప మూవీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. పుష్ప మేనరిజానికి టాలీవుడ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. డేవిడ్ వార్నర్ లాంటి ఓవర్సీస్ అభిమానులు కూడా ఉన్నారు. తాజాగా పుష్ప సినిమాను సాంగ్ను అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించారు. అమెరికా గాట్ టాలెంట్ డ్యాన్స్ షోలో ఇండియాకు చెందిన బీ యూనిక్ క్రూ పుష్ప సాంగ్కు ఒళ్లు గగుర్పొడ్చేలా ప్రదర్శన ఇచ్చారు. ఇది చూసిన ఆడియన్స్ చూస్తున్నంతసేపు ఆందోళనతో పాటు భయానికి గురయ్యారు.
బీ యూనిక్ క్రూ టీమ్ చేసిన సర్ప్రైజ్ ప్రదర్శనకు అక్కడ న్యాయ నిర్ణేతలు సైతం షాకయ్యారు. ఈ వీడియోను పుష్ప టీమ్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఈ వీడియో చూసి అల్లు అర్జున్ సైతం ఫిదా అయ్యారు. వావ్.. మైండ్ బ్లోయింగ్ అంటూ ట్వీట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది. ఇంకెందుకు ఆలస్యం ఈ అద్భుతమైన ప్రదర్శనను మీరు కూడా చూసేయండి.
Wow … Mind Blowing . 🖤 https://t.co/pwVRkSpbqD
— Allu Arjun (@alluarjun) August 4, 2025