
వీరసింహారెడ్డి, హనుమాన్ చిత్రాలతో టాలీవుడ్ మరింత ఫేమ్ తెచ్చుకున్న నటి వరలక్ష్మీ శరత్ కుమార్. కోలీవుడ్తో పాటు తెలుగులోనూ పలు సినిమాల్లో మెప్పించింది. గతేడాది వివాహాబంధంలోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మ.. కొత్త ఏడాదిలో సినిమాలు కాస్తా తగ్గించింది. ప్రస్తుతం తన భర్తతో కలిసి హాలీడే ట్రిప్ను ఎంజాయ్ చేస్తోంది. ఇటీవలే తన మొదటి వివాహా వార్షికోత్సవాన్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది కోలీవుడ్ భామ.
ఫ్యామిలీతో బిజీగా ఉన్న వరలక్ష్మీ తన గొప్ప మనసును చాటుకుంది. హెల్పింగ్ హ్యాండ్స్ హ్యుమానిటి స్వచ్ఛంద సంస్థ పిల్లలకు తనవంతుగా సాయం అందించింది. ఆరు నెలల క్రితం ఇచ్చిన మాటను నేరవేర్చానని తెలిపింది. తన భర్తతో కలిసి అనాథ పిల్లలకు వారికిష్టమైన చెప్పులు, షూస్ను అందించి మరిచిపోలేని జ్ఞాపకాలను ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్స్ వరలక్ష్మీతో పాటు ఆమె భర్త నికోలయ్పై ప్రశంసలు కురిపిస్తున్నారు.