టాలీవుడ్‌ హీరోయిన్ బర్త్‌ డే.. కొత్తకారుతో సెలబ్రేషన్స్! | Tollywood Actress Tanvi Ram Celebrate Her Birthday With New car | Sakshi
Sakshi News home page

Tanvi Ram: క మూవీ హీరోయిన్ బర్త్‌ డే.. కొత్తకారుతో సెలబ్రేషన్స్!

Nov 13 2024 3:54 PM | Updated on Nov 13 2024 4:15 PM

Tollywood Actress Tanvi Ram Celebrate Her Birthday With New car

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం 'క' మూవీతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. సుజిత్- సందీప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. తన్వీరామ్, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా థియేటర్లలో సందడి చేసింది.

అంటే సుందరానికి చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైన ముద్దుగుమ్మ తన్వీ రామ్. నాని హీరోగా నటించిన ఈ సినిమాలో కీలకపాత్రలో మెరిసింది. తాజాగా కిరణ్ అబ్బవరం క మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అంతకుముందు మలయాళంలో పలు చిత్రాల్లో నటించింది. కేరళకు చెందిన ఈ బ్యూటీ ఇటీవల తన బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది.

ఈ సందర్భంగా తన కుటుంబంతో దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఈ ఏడాది పుట్టినరోజున కొత్తకారును కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. మా కుటుంబంలో కొత్త మెంబర్‌తో బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ చేసుకున్నానంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఇది చూసిన అభిమానులు హ్యాపీ బర్త్‌ డే అంటూ విషెస్ చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement