పెళ్లికి రెడీ అయిన టాలీవుడ్ హీరోయిన్.. వైరలవుతోన్న పోస్ట్! | Actress Nivetha Thomas To Get Married Soon?; Post Goes Viral | Sakshi
Sakshi News home page

Nivetha Thomas: పెళ్లికి రెడీ అంటోన్న నివేదా.. ఆ పోస్ట్ అందుకేనా!

Jun 24 2024 6:20 PM | Updated on Jun 24 2024 6:25 PM

Tollywood Actress Ready Knot Her Tweet Goes Viral

టాలీవుడ్ హీరోయిన్ నివేదా థామస్ గురించి పరిచయం ‍అక్కర్లేదు. బాలనటిగా తెరంగేట్రం చేసిన కేరళ కుట్టి తెలుగులోనూ స్టార్‌ హీరోల సరసన అలరించింది. జెంటిల్‌మేన్‌ నుంచి వకీల్‌ సాబ్‌ వరకు తనదైన  నటనతో మెప్పించింది. నిన్నుకోరి, బ్రోచేవారెవరురా, జై లవకుశ,  'జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్' యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ 118, వీ లాంటి టాలీవుడ్‌ సినిమాల్లో మెరిసింది. తెలుగుతో పాటు  మలయాళం, తమిళ భాషల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ అభిమానులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. తాను ప్రేమలో పడినట్లు ట్విటర్‌లో లవ్ సింబల్‌ను పోస్ట్‌ చేసింది. 'కొంత కాలం గడిచింది... కానీ...ఫైనల్లీ' అంటూ లవ్ సింబల్‌ను పోస్ట్ చేసింది. ఇది చూసిన అభిమానులు ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారా? అని కామెంట్స్‌ పెడుతున్నారు. మరికొందరు నివేదా థామస్‌కు అభినందనలు చెబుతున్నారు. ఇంతకీ నివేదా ప్రియుడు ఎవరా? అని కొందరు ఆరా తీస్తున్నారు. అయితే మరికొందరేమో ఏదైనా మూవీ అప్‌డేట్‌ అయి ఉంటుందేమో అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే దీనిపై ఆమె క్లారిటీ ఇస్తే కానీ ఫ్యాన్స్‌కు డౌటానుమానాలు క్లియర్ అవుతాయి.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement