పహల్గామ్ ఉగ్రదాడి.. ఇదే సరైన సమయమన్న మెగా కోడలు! | Tollywood Actress Lavanya Tripathi On Pahalgam Incident | Sakshi
Sakshi News home page

Lavanya Tripathi: పహల్గామ్ ఉగ్రదాడి.. ఆ పనికి ఇదే సరైన సమయమన్న లావణ్య త్రిపాఠి!

Apr 30 2025 4:20 PM | Updated on Apr 30 2025 5:05 PM

Tollywood Actress Lavanya Tripathi On Pahalgam Incident

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌ ఉగ్రదాడిపై అగ్ర సినీతారలంతా పెద్దఎత్తున స్పందించారు. ఈ దాడిని ఖండిస్తూ  మెగాస్టార్‌తో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు సైతం ట్వీట్ చేశారు. ఈ మారణకాండ దేశవ్యాప్తంగా పెద్దఎత్తను పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పలు నగరాల్లో రోడ్లపై పాక్ జాతీయ జెండాలను అంటించి తొక్కుకుంటూ వెళ్లారు.

అలా హిమాచల్‌ ప్రదేశ్‌లోనూ రోడ్లపై పాక్ జాతీయ జెండాలను అతికించారు. అందరూ వాటిపై నడుచుకుంటూ వెళ్తంటే ఓ యువతి మాత్రం పాక్ జెండాలను తీసేందుకు యత్నించింది. ఇది చూసిన కొందరు ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది చూసిన మెగా కోడలు, వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి కాస్తా ఘాటుగా స్పందించింది.

మన సైనికులు తమ ప్రాణాలు అడ్డుపెట్టి దేశాన్ని కాపాడుతుంటే.. కొందరు మాత్రం మనదేశంలోనే ఉంటూ దేశానికి హాని కలిగించే వారికి మద్దతు ఇవ్వడం చూస్తుంటే చాలా బాధగా ఉందని రాసుకొచ్చింది. ఇలాంటి సమయంలో శత్రుదేశంపై దాడి చేయడం మాత్రమే కాదు.. మనదేశం లోపల నుంచి కూడా శుద్ధి చేయాల్సిన సమయం కూడా వచ్చిందని లావణ్య ట్విటర్‌లో పోస్ట్ చేసింది.  

 

Advertisement
 
Advertisement
Advertisement