సినీ నటి హేమ సీరియస్‌.. కరాటే కల్యాణి, తమన్నాకు నోటీసులు! | Tollywood Actress Hema Issued Legal Notices To Karate Kalyani, Tamanna Simhadri And Other Youtube Channels | Sakshi
Sakshi News home page

Hema: సినీ నటి హేమ సీరియస్‌.. కరాటే కల్యాణి, తమన్నాకు నోటీసులు!

Apr 6 2025 6:18 PM | Updated on Apr 7 2025 9:03 AM

Tollywood Actress Hema Issued Legal Notices To Karate Kalyani and tamanna

టాలీవుడ్ సినీ నటి హేమ చర్యలకు దిగింది. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానెల్స్‌కి లీగల్‌ నోటీసులు పంపించింది. కరాటే కల్యాణి , తమన్నా సింహాద్రితో పాటు మరి కొన్ని యూట్యూబ్ ఛానెళ్లకు నోటీసులిచ్చింది. ఈ నిర్ణయంతో తనపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలకు సిద్ధమైంది హేమ. గతంలో తన పరువు, పతిష్టకు భంగం కలిగేలా వీరు కామెంట్స్  చేశారంటూ‌‌... అంతేకాకుండా తనను కించపరిచేలా మాట్లాడారని హేమ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే అలాంటి వారికి నోటీసులు జారీ చేసింది. 

కాగా.. గతేడాది మే నెలలో బెంగళూరులో జరిగిన రేవ్‌ పార్టీలో సినీ నటి హేమను అక్కడి పోలీసులు అరెస్ట్‌ చేశారు. అరెస్ట్‌ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఆ తర్వాత బెయిల్‌పై ఆమె విడుదలయ్యారు. ఆ తర్వాత తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని హేమ స్పష్టం చేశారు.

మా సస్పెన్షన్ ఎత్తివేత..

బెంగళూరు రేవ్‌ పార్టీ కేసు తర్వాత మా నుంచి ఆమె  ప్రాథమిక సభ్యత్వాన్ని తొలగించారు. ఆ తర్వాత అయితే హేమకు నిర్వహించిన రక్త పరీక్షలలో నెగటివ్‌ వచ్చిందని అందుకు సంబంధించిన రిపోర్టులను కూడా ఆమె సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసింది. అంతే కాకుండా కోర్టు కూడా ఆమెకు బెయిల్‌ మంజూరు చేసింది. బెయిల్ రావడంతో హేమపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నట్లు మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ప్రకటించింది. 
 

Advertisement
 
Advertisement
Advertisement