లవకుశ చిత్రంలో సాంగ్‌.. వాళ్లిద్దరు కాదు.. ధన్‌రాజ్‌ పోస్ట్ వైరల్! | Tollywood Actor Dhanraj Controversial Post On Lavakusa Hit Song, Tweet Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

Dhanraj: లవకుశ సాంగ్‌.. క్షమాపణలు కోరిన ధన్‌రాజ్‌

Apr 6 2025 4:55 PM | Updated on Apr 6 2025 6:15 PM

Tollywood actor Dhanraj Post On Lavakusa Hit Song tweet Goes Viral

శ్రీరామనవమి పండుగ అనగానే అందరికీ గుర్తొచ్చే సినిమా అదొక్కటే. అదే సీనియర్ ఎన్టీఆర్ రాముడి పాత్రలో కనిపించిన లవకుశ. ప్రతిష్టాత్మకమైన ఈ ఫెస్టివల్‌ వచ్చిందంటే టీవీల్లో లవకుశ సినిమా చూసేయాల్సిందే. ఈ చిత్రంలో ముఖ్యంగా రామకథను వినరయ్యా అంటూ లవకుశలు పాడే పాట హైలెట్‌. ఈ పాటకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. శ్రీరామనవమి రోజున ఎక్కడ చూసిన ఈ పాటనే వినిపిస్తుంది. ఇంతలా ప్రాముఖ్యత ఉన్న ఈ పాటను పాడిందెవరో తెలుసా? అలనాటి సింగర్స్ సుశీల, లీల.

అయితే ఇవాళ శ్రీరామనవమి కావడంతో మరోసారి ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్‌ అవుతోంది. అయితే టాలీవుడ్‌ నటుడు ధన్‌రాజ్‌ పండుగ వేళ ఈ పాటకు వీడియోను ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. దాదాపు 60 ఏళ్ల క్రితం వచ్చిన లవకుశ చిత్రంలోని పాటను పాడింది వీరిద్దరు అక్కా చెల్లెళ్లు అంటూ సోషల్ మీడియాలో వీడియోను పంచుకున్నారు. అది కాస్తా నెట్టింట వైరల్ కావడంతో పలువురు నెటిజన్స్ పాట పాడింది వీరు కాదంటూ కామెంట్స్ చేశారు.

ఆ తర్వాత అసలు విషయం తెలుసుకున్న ధన్‌రాజ్‌.. తాను పెట్టిన పోస్ట్‌కు క్షమాపణలు చెప్పాడు. ఈ పాట పాడింది వీరిద్దరు కాదు.. పి సుశీల, పి. లీల గార్లు.. తప్పుడు సమాచారం ఇచ్చినందుకు సారీ అంటూ మరో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక సినిమాల విషయానికొస్తే ధనరాజ్ ఇటీవలే రామం రాఘవం చిత్రంతో అభిమానుల ముందుకొచ్చారు.  హీరోగా నటిస్తూ.. తానే దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కోలీవుడ్ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement