breaking news
lavakusalu
-
లవకుశ చిత్రంలో సాంగ్.. వాళ్లిద్దరు కాదు.. ధన్‌రాజ్ పోస్ట్ వైరల్!
శ్రీరామనవమి పండుగ అనగానే అందరికీ గుర్తొచ్చే సినిమా అదొక్కటే. అదే సీనియర్ ఎన్టీఆర్ రాముడి పాత్రలో కనిపించిన లవకుశ. ప్రతిష్టాత్మకమైన ఈ ఫెస్టివల్ వచ్చిందంటే టీవీల్లో లవకుశ సినిమా చూసేయాల్సిందే. ఈ చిత్రంలో ముఖ్యంగా రామకథను వినరయ్యా అంటూ లవకుశలు పాడే పాట హైలెట్. ఈ పాటకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. శ్రీరామనవమి రోజున ఎక్కడ చూసిన ఈ పాటనే వినిపిస్తుంది. ఇంతలా ప్రాముఖ్యత ఉన్న ఈ పాటను పాడిందెవరో తెలుసా? అలనాటి సింగర్స్ సుశీల, లీల.అయితే ఇవాళ శ్రీరామనవమి కావడంతో మరోసారి ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. అయితే టాలీవుడ్ నటుడు ధన్‌రాజ్ పండుగ వేళ ఈ పాటకు వీడియోను ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. దాదాపు 60 ఏళ్ల క్రితం వచ్చిన లవకుశ చిత్రంలోని పాటను పాడింది వీరిద్దరు అక్కా చెల్లెళ్లు అంటూ సోషల్ మీడియాలో వీడియోను పంచుకున్నారు. అది కాస్తా నెట్టింట వైరల్ కావడంతో పలువురు నెటిజన్స్ పాట పాడింది వీరు కాదంటూ కామెంట్స్ చేశారు.ఆ తర్వాత అసలు విషయం తెలుసుకున్న ధన్‌రాజ్.. తాను పెట్టిన పోస్ట్‌కు క్షమాపణలు చెప్పాడు. ఈ పాట పాడింది వీరిద్దరు కాదు.. పి సుశీల, పి. లీల గార్లు.. తప్పుడు సమాచారం ఇచ్చినందుకు సారీ అంటూ మరో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక సినిమాల విషయానికొస్తే ధనరాజ్ ఇటీవలే రామం రాఘవం చిత్రంతో అభిమానుల ముందుకొచ్చారు. హీరోగా నటిస్తూ.. తానే దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కోలీవుడ్ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటించారు.లవకుశ సినిమలో పాడింది p. సుశీలమ్మ,, లీల గార్లు sorry for wrong information 🙏🏿— Dhanraj koranani (@DhanrajOffl) April 6, 2025 -
అభినవ లవకుశులు
రామాయణ గానం.. వారి నిత్యవ్యాసంగం దేశవ్యాప్తంగా ప్రదర్శనలు నేటివరకూ 1400 కీర్తనల రచన ఆధ్యాత్మికరంగంలో తరిస్తున్న కంభంపాటి బ్రదర్స్ రాజమహేంద్రవరం కల్చరల్ : హైదరాబాద్‌కు చెందిన పాతిక వసంతాల కంభంపాటి æకృష్ణ ఆదిత్య ఎంటెక్ చదివిన తరువాత.. బెంగళూరులో మంచి ఉద్యోగం చేపట్టారు. రెండు పదులు దాటిన ఆయన తమ్ముడు కృష్ణశశాంక్ బీటెక్ పూర్తి చేశారు. చిన్నతనాన వారిలో బీజప్రాయంగా ఉన్న శ్రీరామభక్తి వయసుతోపాటు నానాటికీ పెరిగి వటవృక్షంగా ఎదిగింది. రామకీర్తనల రచన, ఆలాపన నిత్యవ్యాసంగాలుగా మారడంతో ఉద్యోగానికి గుడ్‌బై చెప్పి.. హైదరాబాద్ నగరానికి కృష్ణ ఆదిత్య మకాం మార్చారు. శ్రీరామ కీర్తనల రచన, ఆలాపనలు ఆయనకు ఉఛ్వాసనిశ్వాసలుగా మారిపోయాయి. తమ్ముడు కృష్ణ శశాంక్ కూడా అన్నగారి రామాయణ గానానికి తన గళాన్ని జత చేశాడు. దేశవ్యాప్తంగా పయనిస్తూ, వేలాది కీర్తనలు రచిస్తూ, ప్రదర్శనలు ఇస్తున్న ఈ సోదరులు సోమవారం నగరానికి వచ్చారు. సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ ఆధ్వర్యాన కొంతమూరు వల్లభ గణపతి ఆలయంలో రామకీర్తనలు ఆలపించారు. మంగళవారం ఉదయం హైదరాబాద్‌కు పయమైన ఈ సోదరులు రామాయణం తమ జీవిత సర్వస్వంగా ఎలా మారిందో, రచనా వ్యాసంగం తమ జీవితాలను ఎలా మలుపు తిప్పుతోందో, ఉన్నతోద్యోగాలకన్నా రామసేవ తమను ఎలా ఆకట్టుకుందో ‘సాక్షి’కి వివరించారు. ఆ వివరాలు కృష్ణ ఆదిత్య మాటల్లో... ‘‘చదువుకునే రోజుల్లో, హైదరాబాద్ ఎల్బీ నగర్‌లోని ఆంజనేయ స్వామి ఆలయంలో ఒక రోజు ప్రదక్షిణలు చేస్తున్నాను. హఠాత్తుగా నాలో ఒక కీర్తన ప్రాణం పోసుకుంది. ‘శుభదము మధురము ఫలదము, సుధయగు రచనము – స్మృతి, శృతి స్ఫురితము– హరిగుణ మణిమయ నిగళము’ అన్నది ఆ కీర్తన. ఇంటికి వచ్చిన తరువాత కూడా ఆ కీర్తన నన్ను వెంటాడింది. అంతా దైవప్రేరణ అనిపించింది. అది అలంకారాల్లో మొదటిదైన ఏకతాళ అలంకారానికి చెందిన కీర్తన అని గ్రహించాను. రామాయణంలో ఏడుకాండలకు సంబంధించిన ఏడు కీర్తనలను రచించి, ఆలపించడం ప్రారంభించాను. అలల్లా, ఉప్పెనల్లా కీర్తనలు వచ్చి పడటం ప్రారంభమైంది. ప్రతి నెలా ఒక కచేరీ చేయడం ప్రారంభించాం. లలితా సహస్ర నామాలను తీసుకుని, అచ్చ తెలుగులో ‘మా తల్లి లలిత’ పేరిట స్తోత్ర రత్నావళి రచించాను. పిల్లల కోసం శ్రీరామజననం నుంచి రావణ సంహారం వరకూ 108 కీర్తనలను రచించాను. ఇవి బాగా పాపులర్ అయ్యాయి. వీటిలో మచ్చుకి ఒకటి.. ‘బాలా హనుమంతుడు – చాలా బుద్ధిమంతుడు – తల్లి అంజని చెప్పిన సూక్తులు – తప్పకనే వింటాడు – అటు దుమికి, ఇటు దుమికి – ఇల్లు పీకి పందిరేస్తాడు – గొల్లుగొల్లుమని గోల చేస్తాడు’. ఎవరు పిలిచినా, వారింటికి వెళ్లి కీర్తనలను గానం చేసేవాళ్లం. అందరూ మమ్మల్ని అభినవ లవకుశులని పిలిచేవాళ్లు. నాకు సాహిత్యంలో గురువు ఎవరూ లేరు. చిన్నతనంలో అమ్మ, అమ్మమ్మ ప్రహ్లాదచరిత్ర, గజేంద్రమోక్షం, కృష్ణలీలలు ఉగ్గుపాలతో నూరిపోశారు. వాడవాడలా, దేశదేశాలా రామనామ çసంకీర్తనలు మార్మోగాలన్నదే మా ధ్యేయం. ధన్వంతరి ఫౌండేషన్ ఆధ్వర్యాన ఉగాది పురస్కారం అందుకున్నాం’’ అని కృష్ణ ఆదిత్య చెప్పారు.